Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే మంచిది..

Sri Rama Navami

Sri Rama Navami

Sri Rama Navami : నేడు శ్రీరామనవమి.. రాముడి పుట్టిన రోజు. దీంతో దేశవ్యాప్తంగా రాముడి పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించి పూజలు చేయడం ఆనవాయితీ. భద్రాచలంలో రాముడికి ప్రత్యేక పూజలు చేసి రామనామం జపిస్తారు. రాముడికి పూజలు చేసి తరిస్తారు. రామనామమే స్వర్గధామంగా భావిస్తారు. దీంతో శ్రీరామనవమిని వైభవంగా జరుపుకుంటూ దేవుడి ధ్యాసలో ఉంటారు.

శ్రీరామనవమి రోజు ఒక్క రాముడినే పూజించాలా? ఇతర దేవుళ్లను కూడా కొలవాలా? దీంతో మనకు కలిగే పుణ్యమేమిటి? అనే అంశాలపై అందరికీ సందేహలు వస్తుండం సహజమే. రాముడితో పాటు లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఉంటారు. రాముడి తండ్రి దశరథుడిని కూడా స్మరించుకోవడం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు. సీతారామ కల్యాణం జరిపించడం వల్ల మేలు కలుగుతుంది.

రామచంద్రుడికి పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెరపొంగళి, చెరకు, ఇప్పపూలు ప్రసాదంగా సమర్పిస్తారు. దీంతో రాముడికి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే పుణ్యం లభిస్తుందని అంటుంటారు. దేవుడికి ప్రసాదమంటే చాలా ఇష్టం అంటారు. అందుకే పానకం, వడపప్పు ప్రత్యేకంగా చేసి రాముడికి పెడుతుంటారు. దీంతో కాలానుగుణమైన ఆరోగ్యానికి కూడా ఇది పనిచేస్తుంది.

అయోధ్యలో రాముడికి ఎంతో వైభవంగా పూజలు చేస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తజనం విచ్చేస్తుంటారు. రాముడి పట్టాభిషేకం చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. భక్తజనానికి ఆరాధ్య దేవుడు శ్రీరాముడు. అందుకే అయోధ్య, భద్రాచలంలో వేడుకలు చూడటానికి అందరు క్యూ కడుతుంటారు. రాముడి వేడుకలు చూసి పుణ్యం పొందాలని భావిస్తుంటారు.

శ్రీరామనవమి వేడుకలు చూడటానికి అందరు ఉత్సాహం చూపిస్తుంటారు. రామాలయాల్లో పట్టాభిషేకం నిర్వహిస్తారు. అశేష భక్తజనం హాజరై వేడుకలు తిలకిస్తారు. రాముడి పుట్టుక, అతడి పాలన గురించి తెలుసుకుని తరిస్తుంటారు. ఇలా రామచంద్ర మూర్తికి ప్రజలు ఎంతో వైభవంగా వేడుకలు నిర్వహించి ప్రసన్నం చేసుకోవడం తప్పనిసరి.

TAGS