JAISW News Telugu

TDP : ప్రభుత్వం మారడం తథ్యం..అందుకే టీడీపీలోకి జోరుగా వలసలు

TDP

TDP

TDP : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారబోతోందనే ఉద్దేశంతో చాలా మంది పార్టీ మారుతున్నారు. టీడీపీలో చేరిపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ వైసీపీలో భవిష్యత్ ఉండదని నమ్మి ఇప్పుడే సర్దుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాంక్షతో ముందస్తుగానే పార్టీకి వీడ్కోలు చెబుతున్నారు. తరువాత చెప్పినా అంత ప్రాధాన్యం ఉండదు. అందుకే ముందే వైసీపీకి టాటా చెప్పి టీడీపీలోకి వలస వెళ్తున్నారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్నా అక్కడ ముఖ్య నేతలంతా జంప్ అవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే సంబూరు సుభాని, డిప్యూటీ మేయర్ నజీల, ఆమె తండ్రి షౌకత్ పార్టీ మారారు. టీడీపీలో చేరి తమ భవిష్యత్ కు బాటలు వేసుకున్నారు. ఓడిపోయే పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఉద్దేశంతోనే చాలా మంది పార్టీ మారుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో తిరిగే వారు సైతం తాము అధికారికంగా చేరకపోయినా మేం మీ కోసమే పని చేస్తామని చెబుతున్నారంటే వైసీపీ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థమవుతోంది. కానీ వైసీపీ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీనికి సమాధానంగా రోజుకో పది మంది చొప్పున ఎందుకు పనికి రాని వారిని తీసుకెళ్లి మా పార్టీలో చేరుతున్నారని బిల్డప్ ఇస్తున్నారు.

సిక్కోలు నుంచి చిత్తూరు వరకు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతో టీడీపీ కండువాలు కప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు కూడా ఈ ఎన్నికల్లో తమను చేర్చుకోవాలని టీడీపీ వారితో టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల క్షేత్రస్థాయిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని వాపోతున్నారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీకి భంగపాటు తప్పదని తెలుస్తోంది. టీడీపీ కూటమి విజయం సాధించడం తథ్యం అంటున్నారు. వైసీపీ విధానాల వల్ల ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురు కానుంది. వారి ఆగడాలు, దౌర్జన్యాలే వారికి గుదిబండగా మారాయి. ఈనేపథ్యంలో టీడీపీ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అందరు అంచనా వేస్తున్నారు.

Exit mobile version