IT Engineer : ఓ ఐటీ ఇంజినీర్ కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు మాట్లాడే సమయం ఉండడం లేదు. అందరివీ పరుగుల జీవీతాలయ్యాయి. ఒంటరితనం ఓ సమస్యలా మారిపోయింది. అయితే ఆ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేస్తున్న పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరు కోరమంగళలో ఓ నెటిజన్ ఆటో బుక్ చేసుకున్నాడు. ఆయనను పికప్ చేసుకున్న ఆటో డ్రైవర్ మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హుడీని ధరించి ఉండడంతో ఆశ్చర్యపోయాడు. మెల్లిగా ఆ డ్రైవర్ తో మాటలు కలపగా అతను మైక్రెసాఫ్ట్ ఇంజినీరని, ఒంటరితనాన్ని భరించలేక వారాంతాల్లో ఆటో నడుపుతున్నట్లు వెల్లడించాడట. బెంగళూరులో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తున్నాయని, స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండే ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఓ మహిళ తాను బుక్ చేసిన రాపిడో డ్రైవర్ ఓ ప్రముఖ సంస్థలో కార్పొరేట్ మేనేజర్ గా పని చేస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోయానని చేసిన పోస్టు అప్పట్లో సోషల్ మీడియాలో వైరలయింది.