CM Chandrababu: ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అన్న పిలుపునకు ఏపీ ప్రజలు కదిలారు. బాబు ఎక్కడ ఉంటే తాము అక్కడే అంటూ చూపించారు. ఐదేళ్లుగా బాబును దూరం చేసుకొని కష్టాలు అనుభవించామని, ఇక బాబును విడిచిపెట్టేది లేదని చెప్తున్నారు. ఏపీలో సాధారణ రైతుల నుంచి బడా వ్యాపార వేత్తల వరకు చంద్రబాబు రావడంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఐదేళ్లు రాష్ట్రం అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చడమే కాకుండా.. తీవ్రమైన కష్టాలు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో తెలియక ఒంటరిగా రోధించిన సందర్భాలు కూడా ఉన్నాయని కొంత మంది రైతులు బాబు ఎదుట మొరపెట్టుకున్నారు.
ప్రజల కన్నీరు ఏ పాలకుడికి మంచిది కాదు. అందుకే జగన్ వైనాట్ 175 నుంచి 11కు పడిపోయాడు. 11 సీట్లు కూడా ముక్కుతూ మూలుగుతూ వచ్చాయే తప్ప పెద్ద మెజారిటీ రాలేదు. వైసీపీ నాయకుడు జగన్ కే జనసేన అందరు ఎమ్మెల్యేల కంటే తక్కువ ఓట్లు దక్కాయి. ఏది ఏమైనా జగన్ పోవడం, చంద్రబాబు మళ్లీ రావడం ఏపీ ప్రజలు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం రెండు రోజుల క్రితం బుధవారం (జూన్ 12) వైభవంగా జరిగింది. ప్రధాని మోడీతో పాటు రజనీకాంత్, చిరంజీవి, యంగ్ హీరోలు రామ్ చరణ్ తో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత బాబు తన కాన్వాయ్ లో బయల్దేరారు. రోడ్డంతా పూలతో, జనంతో, వాహనాలతో కిట కిటలాడాయి. చంద్రబాబు నాయుడు గ్లోబల్ లీడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హైదరాబాద్ కు ఐటీని తీసుకువచ్చేందుకు ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కలిశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లిలోని నివాసం నుంచి వెలగపూడిలోని సచివాలయంక బయల్దేరిన చంద్రబాబుకు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా దండలు వేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. కరకట్ట నుంచి సీడీ యాక్సిక్ రోడ్డుపైకి భారీగా చేరుకొన్న రైతులు చంద్రబాబు వెళ్లే బాటను రైతులు రంగు రంగుల పూలు, రంగులతో అలంకరించారు. ఇక అధికారులు, నాయకుల వాహనాలతో ఆయన కాన్వాయ్ రాజును తలపిస్తుంది. ఇది చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. మీరూ ఓ లుక్కేయండి.
ఆనాడు ప్రజాక్రోశానికి పరదాలు అడ్డు పెట్టుకున్న రాక్షసుడు…!!
ఈనాడు ప్రజానంద వెల్లువ పూలవర్షమే హద్దుగా వస్తున్న నాయు(కు)డు…!!
BOTH ARE NOT SAME REDDY #APCM_NCBN pic.twitter.com/DKfa81UcA0— A𝕟𝕒𝕟𝕕 Y𝕠𝕕𝕙𝕒 / యువగళం (@AnandYodha) June 13, 2024