Ishan Kishan : సూపర్ హీరో డ్రెస్ లో ఎయిర్ పోర్ట్ కు.. ఇషాన్ కిషన్ స్టయిలే వేరు..

Ishan Kishan
Ishan Kishan : ఐపీఎల్-2024 టోర్నీలో 5 టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 17వ సీజన్లో ఎలాంటి బోణీ కొట్టలేదు. వరుసగా 3 ఓటములతో నిరాశపరిచింది. అయితే.. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఫన్నీ డ్రెస్‌కోడ్‌లో కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఇషాన్ కిషన్ కు శిక్ష పడింది. దీనిలో భాగంగానే ముంబై ఇండియన్స్ లోగోతో ఉన్న ఫన్నీ సూపర్ హీరో డ్రెస్‌తో ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. ఇషాన్ ధరించిన ఈ సూపర్ హీరో డ్రెస్ అక్కడి ప్రయాణికులను విపరీతంగా ఆకర్షించింది. దీంతో పాటు ఇషాన్ కూడా చలాకీగా నడుస్తూ ప్రయాణికులు, సిబ్బందిని నవ్వించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.
ముంబై జట్టు కోచ్, సహాయక సిబ్బంది ఆటగాళ్ల పట్ల చాలా కఠినంగా ఉంటారు. టీమ్ ప్రొటోకాల్ పాటించాల్సిందే. హోటల్ కాల్స్‌కు స్పందించకున్నా, ప్లేయర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చిన ఎంతటి ఆటగాడిగైనా శిక్ష జూనియర్ సీనియర్ వరల్డ్ బెస్ట్ అనే తేడా లేకుండా వాళ్లు రోజంతా ఒకటే డ్రెస్‌లో ఉండాల్సి వస్తుంది.
హ్యాట్రిక్ ఓటమితో..
ప్రతీ సీజన్లో ఓటమితో ప్రారంభించినట్టుగానే ఐపీఎల్-సీజన్ 17లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమితోనే గేమ్ మొదలు పెట్టింది. అయితే.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాయింట్ల పట్టికలో అడుగున ఉండిపోయింది. దీంతో కొత్త కేప్టెన్ హార్థిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అయితే.. జట్టుకు సంబంధించి ఫ్రాంచైజీ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
View this post on Instagram