YCP Strategy : వైసీపీ స్ట్రాటజీ బెడిసి కొడుతుందా?

YCP Strategy

YCP Strategy

YCP Strategy : ఏపీలో ఎన్నికల వేళ పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ విజయం కోసం పలు స్కెచ్ లు వేస్తోంది. ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు గోదావరి జిల్లాల్లో ముఖ్య నేతలపై గురి పెడుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు నేతలు వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ వైసీపీలో చేరింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా కొందరు వైసీపీలో చేరారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలకు చెందిన నేతలు జగన్ పార్టీలో చేరడం గమనార్హం.

పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు వైసీపీకి మారారు. నెల్లూరు జిల్లా జనసేన, టీడీపీ నుంచి జగన్ పార్టీలోకి చేరారు. ఇలా రాష్ట్రంలో పలువురు నేతలను ఆహ్వానిస్తూ తన బలం పెంచుకోవాలని చూస్తున్నారు. విజయమే లక్ష్యంగా చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం వైసీపీ బలం మరింత పెరిగి గెలుపు సునాయాసంగా వస్తుందని ఆశిస్తున్నారు.

నెల్లూరు జిల్లా నుంచి కూడా వైసీపీలోకి వస్తున్నారు. నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఇలా ప్రతి జిల్లాలో చేరికలు భారీగానే జరుగుతున్నాయి. దీంతో తమదే విజయం అని వైసీపీ చెబుతోంది.

ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఒక వైపు టీడీపీ కూటమి, మరోవైపు వైసీపీ, ఇంకో వైపు కాంగ్రెస్ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై సర్వేలు టీడీపీ కూటమిదే విజయం అంటున్నాయి. వైసీపీ మాత్రం తమదే విజయమని ధీమాగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

TAGS