Trump VS Kamala Harris : అమెరికా ఎన్నికల్లో తుది ఘట్టం పోలింగ్ కు ఇంకా రోజులు మాత్రమే ఉంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. భారత్ లో అయితే పోలింగ్ ముందే రోజే రేపటి గెలుపును నిర్ణయిస్తుంది. మరి అమెరికాలో ఎలా ఉంటుందో కదా..? అయితే ఎక్కువగా ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వార చేసుకోనే స్టేట్స్ గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉంటాయి. ఈవీఎంలు, బ్యాలెట్లు తెరిస్తే గానీ గెలుపు, ఓటమి బయటపడదు. సరే.. ఏది ఏమైనా రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు ముందస్తుగా కొన్ని అంచనాలను మాత్రం ఇస్తుంటాయి. ఆ వివరాలు అప్పుడప్పుడు సంచలనంగా మారుతాయి. అందులో ఒకటి కమలా హారిస్ కంటే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే వివరాలు తెలుపుతున్నాయి. గత ఐదేళ్లలో డెమోక్రాట్లకు చెందిన బైడెన్ ప్రభుత్వమే కొనసాగుతోంది. అందుకని అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బ్యాలెట్లు తెరిచే వరకు గెలుపు, ఓటమిపై చెప్పలేం కదా..