gender equality means : అమ్మాయిలు రాను రాను వింతగా ప్రవర్తిస్తున్నారు. జండర్ ఈక్వాలిటీ కావాలని ఫైట్స్ చేసే మహిళలు ఆ విధంగా మాత్రం ప్రవర్తించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒక ట్రైన్ లో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. అది ఎలాగంటే.. ఒక యువతి ట్రైన్ లో ప్రయాణం చేస్తుంది. విండో వైపు సింగిల్ సీట్ లో కూర్చొంది. ఎదురుగా ఉన్న సింగిల్ సీటుపై తన బ్యాగును, కాలు పెట్టుకుంది. ట్రైన్ రద్దీగానే ఉంది. పైన ఉన్న స్లీపింగ్ బెర్త్ పై కూడా కూర్చొని ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆమెను కాలు తీస్తే కూర్చుంటానని ఎవరూ అడగలేదు. ఒకతను కొంచెం ధైర్యం చేసి అడిగాడు. అయితే ఆమె కూర్చో వచ్చు అని చెప్పింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది. ఆమె తనను కూర్చోవచ్చు అని చెప్పింది కానీ కాలు మాత్రం తీయలేదు. పైగా పక్కన ఉన్న బ్యాగు కూడా తీయలేదు. సదరు వ్యక్తి బ్యాకు పైన ఉన్న హోల్డర్ కు తగిలించి యువతి బ్యాగును కూడా హోల్డర్ కు తగిలించాలని అనుకున్నాడు. కానీ యువతి వారించింది. బ్యాగు అక్కడే పెట్టాలని, బ్యాగు పెట్టగా పోను మిగిలిన స్థలంలో మాత్రమే కూర్చోవాలని సూచించింది. దీన్ని వీడియో తీసిన నెటిజన్లు జండర్ ఈక్వాలిటీ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.