T20 World Cup : టీ-20 వరల్డ్ కప్ టీమిండియా జట్టు ఇదే ?

T20 World Cup

T20 World Cup

T20 World Cup : యూఎస్‌-వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఈ నెలాఖరులోగా భారత జట్టును  ఎంపిక చేయనున్నారు.  అయితే ప్రస్తుతం ఐపీఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్న ప్లేయర్లు టీమిండియా జట్టు ఎంపికయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ‘టీమిండియా జట్టు ఎంపికకు వడపోత తప్పేలా లేదు. ఇప్పటికే రాణిస్తున్న కొందరు ప్లేయర్లకు తీవ్ర పోటీ మధ్య నిరాశ తప్పేలా లేదు.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాత్కాలిక 15 మంది సభ్యుల జట్టును ప్రకటించడానికి మే ఒకటో తేదీగా నిర్ణయించింది.  ప్లేయర్ల ఎంపికకు సంబంధించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టులోని ప్రతి సభ్యుడి ఫిట్‌నెస్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ‘భారత్‌ తరఫున ఆడుతూ, టీ20 ఇంటర్నేషనల్‌,  ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు  విశ్వసనీయం సమాచారం.  

బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఐదుగురు

కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  అలాగే యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో యశస్వి బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రింకూ సింగ్ సైతం ఫినిషర్ గా రాణిస్తున్నాడు.
టీమిండియా జట్టు ఫైనల్.. ప్రకటించడమే ఆలస్యం.

టీమిండియా జట్టును  ప్రకటించడానికి  మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఓపెనర్లుగా ఎవరెవరిని పంపాలనే విషయంలో కూలంకశంగా చర్చించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. టీమ్ ఎంపిక విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే  సమావేశమైన విషయం బయటకు వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ  ఓపెనర్లుగా  పంపాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది.  
 
హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్  కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికి  అతని ఎంపికపై ఖాయమని తెలుస్తున్నది. విరాట్ కోహ్లీ కూడా ఓపెనర్ గా రావడం దాదాపు ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌ లకు ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ భావిస్తున్నారు. ఈ 10 మంది ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే అమెరికాకు వెళ్లడం కన్‌ఫామ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టకు నిలకడగా ఆడుతున్న సిరాజ్ మేనేజ్ మెంట్ విశ్రాంతినిచ్చింది.  
 
ఐపీఎల్‌లో ర్యాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా లాంటి యంగ్ ప్లేయర్స్ కు అవకాశం లభించకపోగా, సెలక్షన్ కమిటీ వారిని ఉన్నత స్థాయి టోర్నీల్లో పరీక్షించడం లేదని తెలుస్తున్నది. జింబాబ్వే-  శ్రీలంకతో రెండు వైట్-బాల్ సిరీస్‌లు జరగనున్నాయి. ఇందులో ఈ యంగ్ ప్లేయర్స్ టీమిండియా తరఫున  అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ఆకాష్ మధ్వల్ లాంటి ఆటగాళ్లను బీసీసీఐ నెట్ బౌలర్లుగా తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

జట్టు కూర్పు ఇలా..?

 20 (15+5 స్టాండ్ బై) ఆటగాళ్లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇందులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఉండనున్నారు.
ఇక ఆల్ రౌండర్ల జాబితాలో  హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ లను ఎంపిక చేయవచ్చు.
స్పిన్ స్పెషలిస్టుల నుంచి కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఎంపిక చేయవచ్చు.
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్,  సంజూ శాంసన్ ల ఎంపికకు మొగ్గ చూపే అవకాశం ఉన్నది.  
ఫాస్ట్ బౌలర్ల నుంచి జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్,  అవేశ్ ఖాన్ లకు చోటు ఖాయంగా కనిపిస్తున్నది. 

TAGS