Director Surya Kiran : దర్శకుడు సూర్య కిరణ్ మృతికి కారణం ఇదేనా?
Director Surya Kiran : సత్యం, ధన 51 చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సూర్య కిరణ్. ఆయన ఈ రోజు (మార్చి 11) సోమవారం తెల్లవారు జామున చెన్నైలో కన్నుమూశారు. అతని వయస్సు 51. సూర్య కిరణ్ పచ్చ కామెర్లు వ్యాధి కారణంగా మరణించాడని వైద్యులు చెప్తున్నారు.
సూర్య కిరణ్ బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200 సినిమాల్లో పని చేశాడు. తరువాత, అతను 2003లో సుమంత్ మరియు జెనీలియా నటించిన సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
తర్వాత, సూర్య కిరణ్ ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ మరియు చాప్టర్ 6 వంటి మరి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్లలో అతను కూడా ఉన్నాడు. సూర్య కిరణ్ గతంలో నటి కళ్యాణి (ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ఫేమ్)ని వివాహం చేసుకున్నారు.
తర్వాత కొంత కావాలని ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సూర్య కిరణ్ మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగానే ఉండిపోయారు. సూర్య కిరణ్ సోదరి సుజిత ప్రముఖ టెలివిజన్ నటి. సూర్యకిరణ్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబ సభ్యులకు సంతాపం వెల్లువెత్తుతోంది. అయితే సూర్య కిరణ్ పచ్చ కామెర్ల వ్యాధికి గురై రోజులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.