Small Films : సినీ ప్రేక్షకుల నిరాసక్తకు కారణం ఇదేనా?

Small Films

Small Films

Small Films : ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 23) చిన్న సినిమాలు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చాయి. మల్టీ ఫ్లెక్సులను కూడా మూకుమ్మడి దాడి చేశాయి. కానీ, ఓపెనింగ్స్ మాత్రం కనిపించడం లేదు. వైవా హర్ష చెముడు టైటిల్ రోల్ చేసిన ‘సుందరం మాస్టార్’కు మెయిన్ సెంటర్లలో మాత్రమే ఒక మోస్తారు జనం కనిపించారు. ఇక మిగిలిన సెంటర్లలో మాత్రం పికప్ కాకపోతే కష్టం అనేలా ఉంది. అభినవ్ గోమటంను  హీరో పరిచయం చేస్తూ తీసిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ వైవా హర్ష సినిమా కన్నా దయనీయంగా మారింది. జనాలకు అంతగా రీచ్ కాకపోవడంతో ఇది వచ్చిందన్న సంగతే తెలియలేదు.

ఇక, అర్జున్ రెడ్డి రేంజ్ లో హడావుడి చేసిన సిద్ధార్థ్ రాయ్ థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించడంలో మాత్రం పోరాడుతూనే ఉన్నాడు. ఈ మూవీ కొత్తగా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ పరిశీలిస్తే మాత్రం పెద్దగా కొత్తదనం కనిపించలేదు. టాక్ కూడా మిక్స్ డ్ గా వచ్చింది. సీనియర్ స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్ చేసిన ‘భ్రమయుగం’ మీద ఆశలు పెట్టుకున్న హారర్ లవర్స్ కు మలయాళం హిట్ అనే టాక్ బయటకు వచ్చింది. దీంతో ఈ మూవీని ప్రత్యేకంగా చూసేందుకు అభిమానులు కొంత మేరకు ఇష్టపడ్డారు. అలా అని హౌస్ ఫుల్ బోర్డులు ఏమీ కనిపించలేదు. కానీ, డీసెంట్ ఫిగర్స్ వచ్చే అవకాశాలు కొంత మేర కనిపిస్తున్నాయి.

శుక్రవారం రిలీజైన చిత్రాలు అన్నీ కూడా చిన్న బడ్జెట్ సినిమాలు, దీంతో పెద్దగా ప్రచారంపై ఫోకస్ పెట్టలేదు. దీంతో హైప్ కూడా దొబ్బింది. ఇది అటుంచితే.. సంక్రాంతికి ఊపు తెచ్చిన మూవీలు ఏవీ బాక్సాఫీస్ ను అంతగా హత్తుకోలేకపోయాయి. ‘ఊరు పేరు భైరవకోన’ ఒక్కటే ప్రస్తుతం డీసెంట్ గా నడుస్తుండగా, ‘ఈగల్’ రెండో వారానికే కలెక్షన్లు, థియేటర్లు తగ్గాయి. ఇక ‘యాత్ర 2’, ‘లాల్ సలాం’ల గురించి చెప్పనవసరం లేదు. పైన చెప్పిన సినిమాలకు యునానమస్ గా పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ రోజు సాయంత్రానికి, రేపటికి పర్వాలేదు.. అనే మాట తెచ్చుకుంటే వీకెండ్ కు పుంజుకోవచ్చు. మొదటి రోజు మార్నింగ్ షోకే జనాలు పలుచగా ఉంటే అదే కదా అసలు సమస్య.

TAGS