Rohit Sharma : టీమిండియా రెండోసారి టి20 ప్రపంచ కప్ కప్ నెగ్గి సంబరాల్లో మునిగిపోయింది. అయితే ప్రపంచకప్ గెలిచినటువంటి సందర్భంలో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి తాము టీ20లకు దూరంగా ఉంటామని యువకులకు ఛాన్స్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించగా రోహిత్ శర్మ ఇంతకంటే మంచి ముగింపు ఉండదని అన్నాడు.
రోహిత్ శర్మ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం గురించి
రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు. రోహిత్ శర్మ 2007, 2024 t20 ప్రపంచ కప్ లో సభ్యుడు రెండుసార్లు పొట్టి ప్రపంచకప్ ఒకసారి ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న టీం లో రోహిత్ ఉన్నాడు. కానీ 2011 ప్రపంచ కప్ టీం లో రోహిత్ కు స్థానం దక్కలేదు.
ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్పు రోహిత్ నెగ్గలేడు. 2003 సంవత్సరం లో టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లి ఆస్ట్రేలియా పై ఓడిపోయింది అప్పుడు సౌరబ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నాడు. 2011లో మహేంద్ర ధోని నేతృత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచి అభిమానుల కలను నిజం చేసింది. 2024 t20 ప్రపంచకప్ ను రోహిత్ సారథ్యంలో విజయం సాధించింది. కానీ 2023 వరల్డ్ కప్ వన్డే ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు.
రోహిత్ కు వన్డే వరల్డ్ కప్పు ఇప్పటివరకు అందని ద్రాక్ష గానే మిగిలి ఉంది కాబట్టి 2027 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ సాధించి తన క్రికెట్ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని రోహిత్ శర్మ అనుకుంటున్నాడు. దాని కోసమే టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఈ ఫైనల్ెమ్యాచ్ తనకు చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఇదంతా 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడానికి చర్చించుకుంటున్నారు కానీ రోహిత్ శర్మకు పెద్ద అడ్డంకి అతడి వయసు ప్రస్తుతం 37 కాగా మరో మూడేళ్లలో 40 కి చేరుకుంటుంది అప్పటికి ఫిట్నెస్ తో ఉంటే మాత్రమే టీంలో కొనసాగలుగుతాడు.