Chandrababu : ఈ ఎన్నికలే చివరివా? చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచనలివే?
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక వేదికపై ఇవే తన చివరి ఎన్నికలని చెప్పారు. ఆ తర్వాత తన మాటలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆంధ్ర ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడి వయస్సు, మానసిక పరిస్థితి గురించి చర్చించుకుంటున్నారు.
బహూషా ఆయన చెప్పినట్లుగా 2024 ఎన్నికలు ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చని రాజకీయ విశ్లేషకులు, టీడీపీ వర్గాల నుంచి కూడా వాదనలు విపిస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నికల నాటికి చంద్రబాబుకు 74 సంవత్సరాలు పడతాయి. ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన 50 వరకు జైలు జీవితం గడిపారు. జైలులో అన్ని వసతులు ఉన్నా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. దీంతో ఆ సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వారు మీడియాకు వివరించారు. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కూడా పదే పదే కోరారు. ఆ తీవ్రమైన అనారోగ్యం కారణంగానే ఆయనకు న్యాయస్థానం బెయిల్ కూడా ఇచ్చింది. చంద్రబాబు నాయుడి మానసిక ఆరోగ్యం కూడా కొన్నేళ్లుగా పరిశీలనలో ఉంది. గతంలో సీఎంగా చేసిన సమయంలో కూడా ఆయన అయోమయానికి గురయ్యారు. పరిస్థితి కాలక్రమేణా దిగజారింది.
అయితే, చంద్రబాబు మాత్రం తన నిర్ణయంపై పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తన చివరి ఎన్నికలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ తర్వాత యువరాజు లోకేశ్ కు పగ్గాలు అప్పగిస్తే తన లక్ష్యం నెరవేరుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది!