Ex CM Jagan : రాజుల కాలమైన పాలనా పరమైన వ్యవహారాలు నిర్వర్తించేది రాజుగారి సభ నుంచే. లేదు నా అంతరంగిక గృహం నుంచి పాలన కొనసాగిస్తామంటే కుదరదు. ఒక పనికి చేసేందుకు ఎంచుకునే చోటు కూడా ముఖ్యమే. కానీ ఏపీ మాసీ సీఎం తన ఇంటి నుంచే పాలన సాగించేవారని ఇటీవల ఒక వీడియో చూస్తే అర్థం అవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ మీడియాకు విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ఉంది.
ఇందులో ఒక విషయం నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తుంది. సమావేశం జరిగిన కాన్ఫరెన్స్ రూమ్ సుపరిచితంగా కనిపించింది. ఐదేళ్లలో జగన్ అన్ని అధికారిక కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహించేవారిని తెలుస్తోంది. అప్పట్లో ఇది సెక్రటేరియట్ అని అందరూ భావించారు, ఇప్పుడు అది తన ఇల్లు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. గత ఐదేళ్లలో జగన్ కనీసం సచివాలయానికి కూడా వెళ్లక ఇక్కడి నుంచే పాలన సాగించారని తెలుసుకొని షాక్ కు గురయ్యారు.
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తాడేపల్లి ఇంటిని సీఎం క్యాంపు కార్యాలయంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అప్పటి నుంచి జగన్ తన ఇంటిని కార్యాలయంగా చేసుకొని అక్కడి నుంచే పనిచేస్తూ సచివాలయానికి వెళ్లడం మానేశారు. వెలగపూడి సచివాలయం 2014-19లో చంద్రబాబు హయాంలో నిర్మించారు కాబట్టి జగన్ అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు.
ఇదిలా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పక్కనే కూర్చోవడంతో వైసీపీ అభిమానులు కూడా ఈ వీడియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే సజ్జల తాజా ఓటమికి కారణమని వైసీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.