Jabardasth Faima : ఫైమా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అనతి కాలంలోనే తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. కమెడియన్ గా జబర్ధస్త్ లో ఎన్నో స్కిట్స్ చేసి అలరించింది. ఈ మధ్య చాలా రోజులుగా స్కిట్స్ తోనే కాకుండా సోషల్ మీడియాలో తన ప్రేమాయణంతో అందరి నోళ్లలో నానుతోంది. పటాస్ షో ద్వారా పరిచయమైన ఫైమా ఆ తర్వాత తన నటనతో మెప్పించి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది.
జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తూ తనెంటో నిరూపించుకుంది. ఈ సమయంలో తన బెస్ట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు చేరువైంది. ఇలాంటి సందర్భంలో ఆమె లవ్ ప్రయాణం గురించి విషయాలు బయటకు రావడం తో అందరికిి ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలిసిపోయింది. చిన్ననాటి ఫ్రెండ్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ ఆరో సీజన్ లో చెప్పిన ఈ చిన్నది. బయటకు వచ్చిన తర్వాత మాట మార్చేసింది.
జబర్దస్త్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం రావడంతో జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ లోకి వెళ్లింది. అక్కడ తను ప్రత్యేకంగా నిలిచింది. మంచి పర్ఫా మెన్స్ తో కలిసి అదరగొట్టింది. తర్వాత బయటకు వచ్చి మాటీవీలో షో లు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. మా పరివారం షో లో నటిస్తూ బాగా పాపులర్ అయింది. సూర్యకు జోడిగా డ్యాన్స్ చేస్తూ ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది.
ఫైమా గురించి నెట్టింట్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఫైమా లవర్ ప్రవీణ్ నాయక్ నీ కోసం అయిదేళ్లుగా వెయిట్ చేస్తున్నాను.. ఈ రోజు కోసం అంటూ ఫైమా తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఫైమా మొదట ప్రవీణ్ ను లవ్ చేయగా.. బ్రేక్ కాగా ప్రస్తుతం మరో ప్రవీణ్ నాయక్ తో ప్రేమాయణం సాగిస్తోంది. మరి ఇదైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఎవరీ ప్రవీణ్ నాయక్ అని నెటిజన్లు సెర్చింగ్ మొదలెట్టారు.