Telangana : తెలంగాణలో అప్పులకన్నా చెల్లించేవే ఎక్కువ?
Telangana : బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పలు పడుతోంది. చేసిన అప్పులు, వడ్డీలకు రుణాలు చెల్లించేందుకు ఆపసోపాలు పడుతోంది. అప్పులు, వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు నానా తంటాలు పడుతోంది. గడిచిన 125 రోజుల్లో సగటున రోజుకు రూ. 207 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. అప్పులకు వడ్డీలు, కిస్తీలు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ తిరిగి చెల్లిస్తోంది. దుబారా లేకుండా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా నియంత్రణ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి వడ్డీలు, నెలసరి చెల్లింపులు చెల్లించేందుకు తడిసి మోపెడవుతున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలకు రూ. 17,618 కోట్లు అప్పులు చేయడం గమనార్హం.
రూ. 25కోట్లు అప్పులకు సంబంధించిన చెల్లింపులు చేస్తోంది. తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గిస్తోంది. నిర్మాణాలకు రూ.5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. ఈనేపథ్యంలో అప్పులు నియంత్రించడంలో కొంత మేరకు ప్రగతి సాధించింది. జీఎన్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కోసం ప్రయత్నిస్తోంది.
బీఆర్ఎస్ చేసిన అప్పులతో కాంగ్రెస్ తల్లడిల్లుతోంది. బీఆర్ఎస్ చేసిన పాపం కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోంది. ఈ ఐదేళ్లలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే నానా తంటాలు పడుతోంది. చేసిన అప్పుల భారంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోతోంది.
వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ ఎడాపెడా అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.