AP Liquor Old Brands : ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల జోరు పెరుగుతోంది. రోజుకు కోట్లలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు కొన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నా ఇప్పుడు పాత బ్రాండ్లను మళ్లీ తీసుకొచ్చింది. దీంతో అనూహ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బార్లు, మద్యం దుకాణాలలో అన్ని బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తున్నారు. నాటి పాత బ్రాండ్ల మద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో పాత బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో మద్యం దుకాణాలు జోష్ గా నడుస్తున్నాయి. తమకు పాత బ్రాండ్లు కనిపించడంతో మందుబాబులు కూడా తాగేందుకు ఇష్టపడుతున్నారు. ఎన్నికల సమయంలో మంచి వ్యాపారం జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పాతబ్రాండ్లను తీసుకొచ్చిందని చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో బార్లు, రెస్టారెంట్ల వ్యాపార లావాదేవీలు జోరు మీద నడుస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు రూ. 75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా ఇకపై రోజుకు రూ. 5 నుంచి 10 కోట్ల వ్యాపారం పెరిగే అవకాశముందని అంటున్నారు. నాలుగేళ్ల కాలంలో మద్యం బ్రాండ్ల గురించి ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ధరలు పెంచటం వల్ల మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేయడమేనని చెబుతున్నారు.
పాత బ్రాండ్లను కొత్త పేర్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. మందుబాబుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ బ్రాండ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పాపులర్ బ్రాండ్ల కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు మరింత జోరందుకునే సందర్భంలో పాత బ్రాండ్లకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.