Viral video : కారులో వాటర్ బాటిల్ ఉందా.. అయితే అలర్ట్ మీ కోసమే.. వీడియో వైరల్
Viral video : కొన్ని కొన్ని సందర్భాల్లో కారుకు మంటలు అంటుకొని అందులో ఉన్న వారు అగ్నికి ఆహుతైన ఘటనలు చాలానే విన్నాం.. కొన్నింటిని చూశాం కూడా. అయితే అందుకు కారణం అనేకం ఉన్నాయి. ఒక్కో సారి ఇంజిన్ హీట్ అయి మంటలు అంటుకోవచ్చు, కొన్ని సార్లు బ్యాటరీ కేబుళ్లలో ప్రాబ్లం కలుగవచ్చు, మరికొన్ని సమయాల్లో ఫైర్ కు సంబంధించి వస్తువులు వాహనంలో ఉండవచ్చు. కానీ వాటర్ బాటిల్ కూడా మంటు అంటుకునేందుకు కారణం అవుతుందని ఎవరైనా నమ్ముతారా? అవును మరి అది కూడా ప్రమాదానికి కారణం అవుతుందని తెలుస్తోంది.
మనం కారులో ఎటైనా వెళ్తే.. ఏం తీసుకెళ్తాం.. ఫుడ్ సామగ్రి వాటిలో వాటర్ బాటిల్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఫుడ్ లేకున్నా.. వాటర్ మాత్రం మస్ట్. కొన్ని కిలో మీటర్లు వెళ్లినా కారులో బాటిల్ ఉండాల్సిందే. అయితే ఇదే ప్రమాదానికి కారణం అవుతుందట. ఎవరైనా వాటర్ బాటిళ్లు చేతికి అందేలా పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోవడం భారీ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. వాటర్ బాటిల్ ఎండను తీసుకొని ఒక విధంగా లైట్ ను ప్రొడ్యూస్ చేసి భూతద్దం (magnifying glass)గా మారుతుంది.
భూతద్ధంగా మారిన తర్వాత లైట్ తీసుకొని కారులోని సీటు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఫైర్ ను మండిస్తుంది. దీని కారణంగా కారు మొత్తం అగ్నికి ఆహుతవుతుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటర్ బాటిళ్లను కారులో ఎండ తగిలేలా ఉంచద్దు. అంటే సీటు కింద, లేదంటే ఫ్రంట్ లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో పెట్టుకోవాలి. ఇలా పెడితే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది.