Sierra Leone-AP : ఆఫ్రికా ఖండంలోని సియెర్రా లియోన్ దేశంలో డ్రగ్స్ మాఫియా ఉక్కుపాదం మోపింది. యువత చిత్తవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. కుష్ డ్రగ్స్ మహమ్మారే దీనికి కారణం. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. యువత రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. దీని వల్ల దేశం యావత్తు ఆలోచిస్తోంది.
అసలు డ్రగ్స్ దేశంలోకి ఎలా వస్తోంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఇదంతా జరుగుతోందా? యువతను మత్తుకు బానిసన చేసే డ్రగ్స్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీంతో యువత మత్తులో జోగుతోంది. కుష్ ను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో చేతులెత్తేసింది. అత్యవసర పరిస్థితికి మార్గం వేసింది. ఈ డ్రగ్స్ ఆరేళ్ల క్రితమే దేశంలోకి ప్రవేశించడంతో అమ్మకాలు జోరందుకున్నాయి.
డ్రగ్స్ మాఫియా పెద్దమొత్తంలో సంపాదించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించే అవకాశం లేదు. ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్స్ దేశంలోకి రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు. లంచాలకు మరిగిన ప్రభుత్వం పౌరుల ప్రాణాలు ఫణంగా పెట్టి డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కుష్ తయారీలో మనుషుల ఎముకల పొడిని కూడా కలుపుతున్నట్లు సమాచారం.
డ్రగ్స్ మాఫియా సమాధుల వద్ద భారీగా తవ్వకాలు సాగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అస్థిపంజరాలను సేకరించి పొడి చేసి కుష్ తయారీలో వినియోగిస్తున్నారనని చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం సమాధుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న యువత అనారోగ్యానికి మనుషుల బొక్కలే కారణంగా తెలుస్తోంది.
దీంతో ఏపీలో కూడా డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతోంది. ఇటీవల ఏపీలో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికింది. ప్రస్తుతం కుష్ వ్యవహారం ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఏపీలో కూడా డ్రగ్స్ విషయంలో రాజకీయాలు మానేసి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు.