JAISW News Telugu

YCP social media : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పాపం పండిందా?

YCP social media : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, పులివెందులకు చెందిన వర్ర రవీందర్ రెడ్డిని  కడప తాలుకా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగతున్నాడు. వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అసభ్యకంగా పోస్టులు పెట్టాడు. అలాగే వైఎస్‌ షర్మిల, విజయమ్మ, సునీతపైనా  అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. వైసీపీ అధికారంలో ఉంది కదా అని సోషల్‌ మీడియాలో మితీమిరి ప్రవర్తించాడు .దీంతో వర్ర రవీందర్‌ రెడ్డిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లలో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలే టార్గెట్..
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో హద్దు మీరి రెచ్చిపోయాడు. అసభ్యకరమైన రాతలతో రాక్షసానందం పొందాడు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో  రాబోయేది కూడా తమ ప్రభుత్వమేనని మరింత విర్రవీగాడు. అదే సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వైఎస్ కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు.  అతి జుగుప్సాకరమైన రాతలతో రోత పుట్టించాడు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ సునీతారెడ్డిపైనా రవీందర్ రెడ్డి అసభ్యంగా పోస్టులు పెట్టించాడు. వారి ఫొటోలు సైతం మార్ఫింగ్ చేసి అసభ్యంగా దూషించిన విషయం తెలిసిందే. వీటిపై గతంలో షర్మిల పోలీసుకు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదయ్యాయి.

వంగలపూడి అనితపైనా..
ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో అసభ్యంగా పోస్టులు పెట్టి పైశాచికానందం పొందాడు. అయితే ఆ సమయంలో అనిత హెచ్చరించింది. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదని, తానూ బదులు తీర్చుకునే రోజు వస్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికే నేడు నిజమైంది.

Exit mobile version