Kadapa : ఆంధ్రప్రదేశ్ లో షర్మిల రాజకీయం జగన్ ను భయపెడుతోంది. వివేకా హత్య కేసును ఉదాహరణగా తీసుకుని పీకలు కోసే వారికి మనసు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. వారి ఉద్దేశాలు వేరని నిరూపిస్తున్నారు. వైఎస్ వారసురాలిని తానేనని చెబుతోంది. జగన్ రాక్షసుడని నిరూపిస్తోంది. దీనికి ప్రజలు కూడా సమ్మతిస్తున్నట్లు కనిపిస్తోంది.
జగన్ కు ఓటమి తప్పదని అంటున్నారు. వైఎస్ బిడ్డను మీ మధ్యకు వచ్చి కొంగు పట్టి ఓట్లు అడుక్కుంటున్నాను. తాను ఏ తప్పు చేయలేదని చెబుతోంది. స్వచ్ఛమైన ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంటానని అభ్యర్థిస్తోంది. దీంతో జగన్ శిబిరంలో మెల్లమెల్లగా వణుకు ప్రారంభమైంది.
వివేకా హత్య కేసులో హస్తమున్నట్టు ఆరోపణలు ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి తప్పు చేశారని ఆరోపిస్తోంది. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు షర్మిల వెంటే నిలుస్తున్నారు. అందుకే ఇంత మంది ఆమె సభలకు వస్తున్నారు. వివేకా హత్యపై మాట్లాడొద్దని వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లినా బహిరంగంగా మాట్లాడకపోయినా లోపల మాత్రం దీనిపై చర్చలు నడుస్తున్నాయి.
అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా తన తమ్ముడు మంచివాడు అంటూ జగన్ సంబోధించడం గమనార్హం. జనం గమనిస్తున్నారు. జగన్ కు చెక్ పెట్టడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు అంతా పోయే కాలానికి ఎవరి మాట వినరట. ఇప్పుడు జరుగుతంది అదే. జగన్ నాశనం జరుగుతుందని అందరు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పకపోవచ్చు. అన్ని దారులు మూసుకుపోయాయనే చెప్పుకోవాలి. అతడి పాలన వల్ల ప్రజలు విసిగిపోయారు. నియంత విధానాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో భవిష్యత్ ఇక కష్టమే అంటున్నారు.