JAISW News Telugu

HanuMan : ‘హనుమాన్’ చిత్రం ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిందా..? ప్రేక్షకులను ఇంత మోసం చేస్తున్నారా!

is HanuMan a remake of that movie

HanuMan : రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ‘హనుమాన్’ చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుండి ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. చిన్న టీజర్ తో హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రెండు సార్లు ఈ చిత్రం గత ఏడాది కొన్ని కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ ఈ సినిమాపై హైప్ ఇసుమంత కూడా తగ్గలేదు.

దానికి నిదర్శనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కి ఉన్న డిమాండ్. ఒక స్టార్ హీరో హైప్ ఉన్న సినిమాకి ఏ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో, ఆ రేంజ్ బుకింగ్స్ ఈ చిత్రానికి జరిగాయి. హైదరాబాద్ లో ఈరోజు జరగబొయ్యే ప్రీమియర్ షోస్ కి కోటి రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడం తో ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఓవరాల్ గా నాలుగు కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అదేమిటంటే ఈ మూవీ స్టోరీ లైన్ 2004 లో నితిన్ హీరో గా నటించిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రం స్టోరీ లైన్ తో పోలి ఉంటుందట. ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో నితిన్ అమాయకుడు మరియు బలహీనుడు. కానీ ఆంజనేయ స్వామి పరమ భక్తుడు. అతనికి ఏర్పడిన కొన్ని సమస్యల నుండి రక్షించడానికి ఏకంగా ఆంజనేయ స్వామి నితిన్ వద్దకి వస్తాడు. సరిగ్గా ఇదే స్టోరీ లైన్ తో ‘హనుమాన్’ చిత్రం కూడా ఉంటుందట. దీంతో ‘హనుమాన్’ చిత్రం ‘శ్రీ ఆంజనేయం’ కి రీమేక్ అని సోషల్ మీడియా లో కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకే స్టోరీ లైన్ తో వందల సినిమాలు రావడం మన టాలీవుడ్ కి కొత్తేమి కాదు. డైరెక్టర్ కథ, కథనం, స్క్రీన్ ప్లే మరియు ఎమోషన్స్ ఎలా పండించాడు అనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

‘హనుమాన్’ మూవీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఇప్పటి వరకు అద్భుతంగా ఉంది. సినిమా క్వాలిటీ హై బడ్జెట్ చిత్రాలను కూడా మించిపోయింది, మంచి సినిమాలు వస్తున్నప్పుడు ఆదరించకపోయిన పర్వాలేదు , ఇలా నెగటివ్ ప్రచారాలు చేసి చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ని చంపేయొద్దు అంటూ వేడుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్.

Exit mobile version