Congress Party : రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందా?
Congress Party : తెలంగాణలో ప్రభుత్వం రైతుబంధు పథకం కొనసాగిస్తోంది. ప్రతి ఏటా రెండు సార్లు ఖరీఫ్, రబీ సీజన్ లలో ఎకరానికి రూ. 5 వేలు చొప్పున అందిస్తోంది. ఇప్పుడు రబీ సీజన్ కావడంతో రైతుబంధు ఇచ్చేందుకు రెడీ అయినా ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు రైతుబంధు సాయం ఖాతాల్లో వేయాలని భావించింది.
దీనికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని విమర్శిస్తోంది. కాంగ్రెసోళ్లు రైతుబంధు వద్దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మీరు రైతులు కాదా? రైతుల్లో కాంగ్రెస్ వారు కూడా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ రైతుబంధు ఇవ్వొద్దని చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఓట్లతో సంబందం లేకుండా రైతుల కోసమే ఇస్తున్న పథకాన్ని అడ్డుకోవడం అవివేకం.
ధరణి పథకాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పడం కాంగ్రెస్ వారి అనుచిత వైఖరికి నిదర్శనం. దీనిపై కేసీఆర్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ లోపభూయిష్టమైన విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు ఇంత దారుణంగా ఉన్నా దానికి ప్రజలు ఎలా ఓట్లేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించి ఓటు వేయాలని గుర్తు చేస్తున్నారు.
ప్రజల కోసం పలు పథకాలు తీసుకొచ్చిన తాము గొప్పా? ఉన్న పథకాలను తీసేసే కాంగ్రెస్ మంచిదా? ఆలోచించుకోండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలు కరెంటు ఉండదు. మళ్లీ కరెంటు కష్టాలు మొదలవుతాయి. రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయం. కాంగ్రెస్ వాళ్లు కూడా ఆలోచించి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారు.