Movie Stopped : ఆ సినిమా అందుకే ఆగిపోయిందా? నిర్మాతలను పట్టించుకోకుంటే అంతే!

Movie Stopped

Movie Stopped

Movie Stopped : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఓటీటీ పరిధి విస్తృతంగా పెరుగుతుండడం చూసిన హీరోలు వారి రెమ్యునరేషన్ ను కూడా విపరీతంగా పెంచేశారు. దీనికి తోడు నిర్మాతలకు అదనపు ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్లు తీసుకునే హీరోలు కూడా రూ. 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్లు తీసుకునే హీరోలు రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వీరి విపరీతమైన పెంపుతో పైకి చెప్పలేక.. లోపల ఖర్చుల భారం భరించలేదక సతమతం అవుతున్నారు.

ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ఒక బిగ్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లెక్కలు వేసుకుంటే రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది. ఇంత మొత్తంలో రెమ్యునరేషనే రూ. 25 కోట్ల వరకు ఉంది. కానీ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 100 కోట్లకు కూడా రీచ్ కావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ సంస్థకు గోపీచంద్ ఇచ్చిన డేట్లను మరో హీరో కోసం వాడే ప్రయత్నం జరుగుతోంది.

ఇక ‘ధమాకా’ తర్వాత రవితేజతో సినిమా చేసిన ఏ నిర్మాతకు లాభాలు రాలేదు. మొదట్లో టేబుల్ ప్రాఫిట్ కనిపించడం, తర్వాత సినిమా ఫ్లాప్ కావడం, జీఎస్టీలు వెనక్కి ఇవ్వడం. ఇవన్నీ కలుపుకుంటే నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. కానీ పాపం నిర్మాతలు ఈ విషయాలను పైకి చెప్పుకోలేదు. హీరోలు రెమ్యూనిరేషన్లు తగ్గించుకోకుంటే నిర్మాతలు ముందుకు రావడం కష్టం.

TAGS