IPL 2024 : ఈ సారి ఐపీఎల్ కప్పు కొట్టేబోయేది.. ఆ టీమేనా..

IPL 2024

IPL 2024

IPL 2024 : ఐపీఎల్ సీజన్ ఎప్పటిలాగానే ప్లే ఆప్స్ బెర్తులు ఇంకా కన్ ఫాం కాలేదు. అన్ని జట్లకు ఒకటి లేదా రెండు మ్యాచులు మిగిలి ఉన్న దశలో ఒక్క కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రమే క్వాలిపై అయింది. మిగతా జట్లు ఇంకా టాప్ ఫోర్ లో చోటు సంపాదించడానికి అపసోపాలు పడుతుతున్నాయి.

ఐదు సార్లు చాంపియన్ ముంబయి ఇండియన్స్ ఈ సారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చేతులెత్తేసిన సమయంలో మ్యాచులు ఓడిపోవడంలో పంజాబ్ తో పోటీ పడుతోంది. అయిదు సార్లు చాంపియన్ అయినా చెన్నై ప్లే ఆప్ రేసులో నిలవాలంటే కచ్చితంగా తను ఆడబోయే లాస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే. 13 మ్యాచుల్లో  7 విజయాలు, 6 ఓటములతో 14 పాయింట్లతో ఉంది.

పక్కనే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో, బెంగళూరు టీంలు కూడా చెన్నై కు గట్టి పోటీనిస్తున్నాయి. లక్నో కూడా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. రెండింట్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో టాప్ ఫోర్ లో నిలవడానికి చాన్స్ ఉంది. సన్ రైజర్స్ కు రెండు మ్యాచులు ఉన్నాయి. రెండింటిలో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆప్ లో అడుగుపెడుతుంది. రాజస్థాన్ ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆప్ లో చేరడం ఖాయం.

 కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం తన ఆటతీరుతో చెలరేగిపోతుంది. పిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ లాంటి బ్యాటర్లు చెలరేగి ఆడుతుండడంతో బ్యాటింగ్ లో అదరగొడుతుంది. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయజాలం చేస్తున్నారు. కొత్త కుర్రాళ్లు  హర్షిత్ రాణా, వైభవ్ ఆరోరా తమ స్థాయికి మించి ప్రదర్శన చేస్తున్నారు. స్టార్క్ సీజన్ మొదట్లో తడబడినా ప్రస్తుతం కుదురుకున్నాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడి 9 గెలిచింది. ఒక డ్రాతో 19 పాయింట్లతో టాప్ వన్ ప్లేస్ లో చేరింది.  క్వాలిఫైయిర్ 1 మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచి ఫైనల్ లో కప్ కొట్టాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరి కోల్ కతా దూకుడు ఏ టీమైనా కళ్లెం వేస్తుందా లేదో చూడాలి.

TAGS