Mark Shankar : మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ అదేనా..? మరి సింగపూర్ కి ఎందుకెళ్ళాడు?

Mark Shankar
Mark Shankar School : మార్క్ శంకర్ గురించి సోషల్ మీడియాలో నెలకొన్న అనేక అనుమానాలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చదువుతున్నాడు. ప్రస్తుతం అతను మూడవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. సింగపూర్‌కి మాత్రం వేసవి సెలవుల్లో ‘టమోటో కుకింగ్ స్కూల్’ అనే సమ్మర్ క్యాంప్‌కి మాత్రమే వెళ్లాడు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినప్పటికీ, పక్కనే ఉన్న చిన్నారి మృతి చెందడం విషాదకరం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు, త్వరలో ఇండియా కి తిరిగొచ్చి సినిమాతో పాటు ప్రభుత్వ బాధ్యతల్లోనూ తిరిగి చేరబోతున్నారు.