Keerthy Suresh : కీర్తి సురేష్ నెగటివ్ రోల్ లో కనిపించిన ఏకైక సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!
Keerthy Suresh : నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో యాక్టింగ్ పరంగా ఎవరు నెంబర్ 1 అని ఎదిగితే టక్కుమని క్షణం కూడా ఆలోచించకుండా కీర్తి సురేష్ పేరు చెప్పేస్తాం. అందం తో పాటుగా, నటన లో కూడా ఈమె తనదైన మార్కుని ఏర్పాటు చేసుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి లాగ జీవించి ఉత్తమ నటిగా ఏకంగా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. ఈమెతో కలిసి సినిమా చెయ్యాలంటే స్టార్ హీరోలు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు.
అంతే కాదు, వారిలో ఈమె ఎక్కడ తమని డామినేట్ చేస్తుందో అనే భయం కూడా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన కీర్తి సురేష్, తన మొదటి చిత్రం నెగటివ్ రోల్ చేసిందనే విషయం ఎవరికీ తెలియదు. బాలనటిగా ఈమె పలు మలయాళం సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెద్దయ్యాక ఈమె ‘గీతాంజలి’ అనే సినిమా చేసింది. ఇదే ఆమె మొదటి చిత్రం.
మలయాళం లో అప్పట్లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమాలో హీరో గా మోహన్ లాల్ నటించాడు. ఇందులో కీర్తి సురేష్ డ్యూయల్ రోల్ చెయ్యగా, ఒక పాత్ర పూర్తి స్థాయి నెగటివ్ రోల్ అవ్వడం విశేషం. నెగటివ్ రోల్ లో ఆమె మొదటి చిత్రం తోనే మలయాళం ప్రేక్షకులను భయపెట్టేసింది. చాలా టాలెంట్ ఉంది ఈ అమ్మాయిలో, భవిషత్తులో పెద్ద స్టార్ అవుతుంది అని అందరి చేత అనిపించుకుంది. ఇదే సినిమాని తెలుగు లో ‘చారులత’ పేరుతో ప్రియమణి రీమేక్ చెయ్యగా, హిందీ లో బిపాసా బసు ‘ఎలోన్’ పేరుతో రీమేక్ చేసింది. రెండు భాషల్లోనూ పెద్ద ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం. ఇటు ప్రియమణి కానీ, అటు బిపాసా బసు కానీ కీర్తి సురేష్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. అందుకే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో కీర్తి సురేష్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్స్ కొడుతూ ముందుకు దూసుకెళ్లి స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు లో ఈమె హీరోయిన్ గా మన అందరికీ పరిచయమైన మొదటి సినిమా ‘నేను శైలజ’. ఇప్పటికీ కూడా ఈమె రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా, నటన స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ ని మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తుంది.