Jagan Defeat : ఏపీ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రానికే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలను కూడా విస్మయానికి గురి చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ కూటమి 151 సీట్లు సాధించగా.. వైసీపీ కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగన్ ఇంత మేర పడిపోవడంలో చంద్రబాబు, పవన్ పాత్ర ఎంత ఉందో అంతే పాత్ర మరొకరిది ఉంది. ఆయనే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు.
అవును మీరు విన్నది నిజమే డైరెక్ట్ రామోజీరావు రంగంలోకి దిగకున్నా.. ఆయన సంస్థలు మాత్రం ఆ మేర పని చేసి మరీ జగన్ ను దెబ్బకొట్టాయి. జగన్ 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఈనాడు సంస్థలను వేధింపులకు గురి చేశాడు. ఆయనకు ముందు ఆయన తండ్రి కూడా ఈనాడుకు ప్రధాన వనరు అయిన మార్గదర్శిని దెబ్బతీస్తే ఈనాడు కాల గర్భంలో కలిసి పోతుందని అనుకున్నాడు. అందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ సాగలేదు. ఆయన మరణానంతంరం ఈనాడు ఊపిరి పీల్చుకుంది.
అయితే, ఆ తర్వాత 2019లో వచ్చిన జగన్ కూడా తన సొంత మీడియా గ్రూపును చూసుకొని ఈనాడును పూర్తిగా తొక్కిపెట్టాలనుకున్నాడు. అందుకు తన తండ్రి ఆలోచనలతోనే నడిచాడు. మార్గదర్శిని దెబ్బ కొట్టాలనుకొని ఇన్వెస్టర్లను భయాందోళనకు గురి చేశారు. తమ డబ్బును తిరిగి అడగాలని వారిపై ఒత్తిడి తెచ్చింది. కానీ అవేవీ ఫలించలేదు. ఇవేవీ కలిసి రాకపోవడంతో విచారణ పేరుతో సీఐడీని పంపారు. సీఐడీ రామోజీరావును, ఆయన కోడలు శైలజను ఇబ్బంది పెట్టింది. 80 ఏళ్ల వయస్సులో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోను కూడా లీక్ చేసింది జగన్ ప్రభుత్వం.
ఈనాడుతో పెట్టుకొని తాను కొరివితో తలగోక్కుంటున్నానని తెలియలేకపోయింది. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి సైతం ఏమీ చేయలేకోయారు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తాడని విశ్లేషకులు కూడా చెప్పారు. కానీ జగన్ అవేవీ పట్టించుకోలేదు. ఈనాడు కూడా దేనికి, ఎప్పుడూ భయపడలేదు, జంకలేదు, వెనకడుగు వేయలేదు. ఒక దశలో చంద్రబాబు సైలెంట్ అయినా ఈనాడు మాత్రం మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఎల్లో మీడియా అంటూ ఎంత ప్రచారం కల్పించినా జగన్ పై మాత్రం పట్టు బిగిస్తూనే ఉంది. ఏపీలో జగన్ పాలనపై అక్షరం పొల్లు బోకుండా ప్రజల ముందుంచారు.
ఈనాడుకు ప్రజల్లో విపరీతమైన విశ్వసనీయత ఉంది. దీన్ని జగన్ మరిచిపోయారు. తన మీడియా సాక్షి, టవీ9, ఎన్టీవీ లాంటివి ఉన్నాయనే ధీమాతో ఉన్నారు. కానీ వీటన్నింటికంటే ఈనాడునే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవడంలో ఈనాడు ఎప్పుడో సక్సెస్ అయ్యింది. దీన్ని గమనించకుండా జగన్ వ్యవహరించడం దెబ్బకొట్టింది.