Harish Shankar : ఇక హరీష్ శంకర్ ను ఆదుకోవాల్సింది ఆ హీరోనే?

Harish Shankar

Harish Shankar

Harish Shankar : టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ కు మారు పేరు హరీష్ శంకర్. ఓ ఎంటర్ టైన్ మెంట్ మూవీలో ఏమేం ఉండాలో అన్నీ సమపాళ్లలో రంగరించగల సమర్థుడనే పేరు తెచ్చుకున్నాడు.  మాస్ హీరోలు హరీష్ శంకర్ తో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక హీరోయిన్లను తెరపైన అందంగా చూపించడంలో దిట్ట. రాఘవేంద్రరావు, కృష్ణ వంశీ తరువాత హీరోయిన్లను అందంగా చూపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో హరీష్ శంకర్ సినిమాతో హీరోయిన్లకు స్టార్ డమ్ మొదలవుతుంది. ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హసన్ ను గబ్బర్ సింగ్ సినిమాతో  స్టార్ హీరోయిన్ గా మార్చేశాడు.

ఓ సినిమా హిట్టు.. మరో సినిమా ప్లాఫ్ తో ముందుకు సాగుతున్న హరీష్ శంకర్ కు మిస్టర్ బచ్చన్ పెద్ద దెబ్బే వేసింది. హరీష్ శంకర్ లోని క్రియేటివిటీ ఏదీ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిస్టర్ బచ్చన్  ఫలితం భవిష్యత్ పై ప్రభావితం చూపబోతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తతున్నాయి.  చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి హిట్లే పడ్డాయి. అవి కూడా రీమేక్ లే కావడం విశేషం.  తొలి సినిమా షాక్ ఫలితం హరీష్ శంకర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మిస్టర్ బచ్చన్ ప్లాఫ్ మాత్రం చాలా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ ని మరో హీరో నమ్మి సినిమా చేసేది అనుమానమేననే టాక్ వినిపిస్తున్నది.

బచ్చన్ రిలీజ్ కు ముందే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో ఓ సినిమా చేసేందుకు హరీష్ శంకర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు టాక్. టాప్ హీరోలు వెంక‌టేష్, బాల‌కృష్ణ తదితరులను సంప్రదించినా వారు పట్టించుకోలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను కలిసినా అక్కడా ఊగిసలాటే కనిపిస్తున్నది.   అటు రామ్ డబుల్ ఇస్మార్ట్ యావరేజ్ గా నిలవడం, హరీష్ శంకర్ సినిమా ప్లాఫ్ కావడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థతి. ఒక వేళ ఓకే చెప్పినా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేది అనుమానమేనంటూ రామ్ కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ ఇప్పటికే రామ్ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం రామ్ రిస్క్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక పవన్ సినిమానే హరీష్ శంకర్ కు దిక్కయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ హిట్టయితే తప్ప హరీష్ శంకర్ కు భవిష్యత్ ఉండేలా కనిపించడం లేదు.  ప్లాఫుల్లో ఉన్న హరీష్ ను పవన్ కల్యాణే ఆదుకోవాలి. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యారు. పవన్ కాల్షీట్లు ఇస్తే తప్ప మెగాఫోన్ పట్టలేని పరిస్థితి హరీష్ శంకర్ ది.

TAGS