‘దేవర’ బ్రదర్ సూరీగా ఆ స్టార్ హీరోనా? అయితే రచ్చరంబోలానే..

Devara NTR Brother Role

Devara NTR Brother Role

Devara NTR Brother Role : కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా ‘దేవర’ నామస్మరణే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత మాత్రం.. ‘దేవర’ని తట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. అంతగా కొరటాల శివ ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ‘దేవర’ని రెండు పార్ట్‌లుగా ప్రకటించేసిన కొరటాల.. మొదటి పార్ట్ విడుదల తేదీని కూడా పనిలోపనిగా అధికారికంగా చెప్పేశాడు. ఎప్పుడైతే విడుదల తేదీ అనౌన్స్ చేశాడో.. అసలు షూటింగ్ విషయంలో కొరటాల కాంప్రమైజ్ కావడం లేదట. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

అలాంటి ఫ్యాన్స్ కళ్లలో ఆనందం నింపడం కోసం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పోస్టర్‌తో ‘దేవర’ దర్శనం అయ్యేలా చేసిన మేకర్స్.. జనవరి 8న చిత్ర గ్లింప్స్‌తో సంక్రాంతికి సరిపడా సందడికి సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట. అతనెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. విజయ్ ఇందులో భాగం కాబోతున్నాడనే వార్త మాత్రం టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది.

Devara NTR Brother Role

Devara NTR Brother Role Vijaya Devarakonda

వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘దేవర’ రెండో పార్ట్‌లో దేవర సోదరుడు సూరీగా విజయ్ దేవరకొండ ఓ ఊర మాస్ అవతార్‌లో కనిపించనున్నాడట. అందరూ సూరీగాడు అని పిలుస్తారట. అంతేకాదు, రెండో పార్ట్‌లో సూరీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, కథను మలుపుతిప్పే పాత్ర అవుతుందనేలా టాక్ నడుస్తోంది. అంతేకాదండోయ్.. విజయ్ పాత్రకు సంబంధించి ‘దేవర’ పార్ట్ 1 ముగింపులోనే కొరటాల హింట్ ఇస్తాడని అంటున్నారు. ఈ విషయం వింటుంటేనే.. యమా మజాగా ఉంది. నిజంగా విజయ్ ఇందులో కనిపిస్తే.. ఇక రచ్చరంబోలానే అని చెప్పుకోవచ్చు. ఇదే విషయంపై అప్పుడే సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో వార్తలు మొదలయ్యాయి. మరి సూరిగాడు నిజమేనా? అనేది తెలియాలంటే మాత్రం మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయాల్సిందే.

యంగ్ టైగర్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘దేవర’ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ‘దేవర’ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

TAGS