Hero behavior : స్టార్ డమ్ తెచ్చిన ఆ బిహేవియరే ఆ హీరో కొంపముంచుతుందా?
Hero behavior : సినీ రంగంలో ఏ శాఖలో ఉన్నా ఎవరు ఎప్పుడు పైకి ఎగిరేది తెలియదు. ఎప్పుడు కింద పడిపోయేది తెలియదు. ఈ రంగంలో సక్సెస్ రావడం ఎంత కష్టమో దానిని కాపాడుకోవడం అంతకన్నా కష్టం. సినీ పరిశ్రమలో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాలేక కనుమరుగైన వారెందరో ఉన్నారు. వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవడానికి టాప్ హీరోలు సైతం ఎంత ఒదిగి ఉంటున్నారో కొందరిని చూస్తుంటే అర్థమవుతుంది. 30 ఏళ్లుగా ఇండస్ర్టీలో నంబర్ వన్ హీరో అనిపించుకున్న మెగా స్టార్ కూడా ఇప్పటికి నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, కో స్టార్లతో పాటు తనను అమితంగా ప్రేమించే అభిమానుల పట్ల అంతే విధేయతగా ఉంటాడు. ఈ ఒక్క లక్షణం చెప్పవచ్చు తను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో.
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో గురించి కూడా ప్రస్తుతం చర్చ జరగుతున్నది. అతనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ ఓవర్ నైట్ లో స్టార్ కాలేదు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒకడిగా కనిపించాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వందశాతం ఉపయోగించున్నాడు. సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన సత్తా చూపి హీరో అయ్యాడు. వరుస హిట్లు కొట్టాడు. కానీ అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ బిహేవియర్ లో మార్పు వచ్చింది. అయితే ఆ సినిమాలో విజయ్ చేసిన క్యారెక్టర్ అలాంటి కావడంతో ఫ్యాన్స్ కూడా పాజిటివ్ తీసుకున్నారు. కానీ గీత గోవిందం లాంటి భారీ సక్సెస్ తర్వాత కూడా విజయ్ అదే బిహేవియర్ కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత విజయ్ కు చెప్పకోతగ్గ సినిమాలైతే పడలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనా మధ్య రిలీజ్ కాగా, తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ పరిస్థితి పైకి ఎగిరి కింద పడినట్లయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా ప్లాఫ్ అయ్యింది. లైగర్ సినిమా రిలీజ్ సమయంలో విజయ్ ప్రెస్మీట్లు, ఈవెంట్లలో మాట్లాడిన తీరు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. దీనికి తోడు సినిమాల్లో దమ్ము లేకపోవడంతో ఆ ప్రభావం విజయ్ పై గట్టిగానే పడింది..