JAISW News Telugu

ICC Trophy : టీమిండియా ఐసీసీ ట్రోఫీ చింత తీరేది అప్పుడేనా?

ICC Trophy

Team India

ICC Trophy : 2013 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ టోర్నమెంట్ ను గెలవలేకపోయిందని చెప్పడం బాధాకరమే. ఇది ఫ్యాన్స్ ను ఎంతగానో నిరాశకు గురిచేసేదే. లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్ దాక బాగా ఆడడం.. ఫైనల్ లో కప్ ను చేజార్చుకోవడం టీమిండియాకు తప్పడం లేదు. అయితే మరో 15 నెలల్లో మూడు ఐసీసీ టోర్నమెంట్లు జరుగనున్నాయి. వాటిలోనైనా ఐసీసీ ట్రోఫీ చింత తీరుతుందో లేదో చూడాలి.

ఐపీఎల్ 2024 ప్రారంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత క్రికెట్ అభిమానులు రాబోయే 15 నెలలపాటు వినోదాన్ని హైఎండ్ లో అనుభవించనున్నారు. ఎందుకంటే ఐసీసీ 15 నెలల్లో మూడు టోర్నీలను నిర్వహించబోతోంది.

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ-20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. యూఎస్ఏ-వెస్టిండీస్ కలిసి ఈ టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు నిర్వహించనున్నాయి. ఇక ఆ తర్వాత ఐసీపీ చాంపియన్స్ ట్రోఫీ 2025 లో జరుగనుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య జరుగనుంది. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 10 జట్ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగబోతోంది.

అలాగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ చివరి మ్యాచ్ 2025 జూన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరుగనుంది. ఈ మూడు ఐసీపీ టోర్నీలు కేవలం 15 నెలల్లోనే జరుగడం విశేషం. ఐసీపీ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుని 10 ఏండ్లు పూర్తయ్యాయి.  2013లో ధోనీ సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరే ఐసీసీ (ICC Trophy) ట్రోఫీని గెలుచుకోలేదు. రాబోయే టోర్నీల్లో నైనా టీమిండియా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version