Samantha-Prabhas : ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే అదృష్టం అనుకునే రోజులు ఇవి. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటిస్తే తెలుగు తో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ ఇలా అన్నీ బాషల ఆడియన్స్ కి పరిచయం అవ్వొచ్చు. కానీ సమంత మాత్రం ప్రభాస్ తో నటించడానికి వెనకాడినట్టు అప్పట్లో ఒక వార్త వినిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో ప్రభాస్ హీరో గా ‘డార్లింగ్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఊర మాస్ ఇమేజి ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా లవర్ బాయ్ ఇమేజి ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం లో క్యూట్ అండ్ బబ్లీ గర్ల్ గా కాజల్ అగర్వాల్ నటించింది. వాస్తవానికి ఈ రోల్ ముందుగా సమంత చెయ్యాల్సి ఉందట. ఆమె మొదటి సినిమా ఇదే అయ్యేది అట. కానీ ప్రభాస్ లాంటి పొడవు మనిషి పక్కన తాను చాలా పొట్టిగా కనిపిస్తానని, మొదటి సినిమాతోనే ట్రోల్ల్స్ కి గురి అవ్వడం ఇష్టం లేక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.