Ram Charan-Upasana : గత కొంతకాలం గా జాతకాల పేరుతో సోషల్ మీడియా లో వేణు స్వామి ఎంత ఫేమస్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పి, వాళ్ళు నిజంగానే విడాకులు తీసుకోవడం తో వేణు స్వామి ని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. కానీ ఆయన నిజంగా జాతకం చూసే చెప్పాడో, లేదా చీకట్లో బాణం వేశాడో ఎవరికీ తెలియదు కానీ, వేణు స్వామి అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నాడు అని అర్థం అవుతుంది.
ముఖ్యంగా ప్రభాస్ విషయం లో వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆయనకీ బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా రాదనీ చీకట్లో ఒక బాణం వదిలాడు. వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యేలోపు వేణు స్వామి చెప్పింది నిజమేనేమో అని నమ్మారు కొంతమంది. కానీ గత ఏడాది ప్రభాస్ నుండి విడుదలైన సలార్ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వేణు స్వామి జాతకాలపై మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి.
నోటి ఎప్పుడు అశుభాలు మాట్లాడే వేణు స్వామి, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ మరోసారి గెలిచి సీఎం అవుతాడని చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం లోకి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన రామ్ చరణ్, ఉపాసన కి సంబంధించి ఒక శుభవార్త చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘సరిగ్గా మరో పడి నెలల్లో రామ్ చరణ్ , ఉపాసన జంటకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు కారణంగా మెగా ఫ్యామిలీ లో అన్నీ శుభాలే జరుగుతాయి’ అని చెప్పాడు. చెప్పింది మంచి విషయమే అయ్యినప్పటికీ అభిమానులు దీనిని నమ్మడం లేదు.
రామ్ చరణ్, ఉపాసన జాతకాలు నీ దగ్గర అసలు లేవు, అయినా కూడా ఈ సొల్లు మొత్తం చెప్తున్నావు. నిన్ను మేము నమ్మము అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే బాగుంటాది అని కొందరు ఇంకా ఆయన్ని నమ్ముతున్నారు. కానీ వేణు స్వామి చెప్పే జాతకాలు అన్నీ చీకట్లో బాణాలు వేసే కార్యక్రమాలే, ఆయనకీ అసలు ఏమి తెలియదు అని బాబు గోగినేని వంటి వారు లైవ్ లో నిరూపించి వేణు స్వామి పరువు తీశారు.