Rajamouli : రాజమౌళి ఆ మూడు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడా..?

Rajamouli : పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరుగాంచిన రాజమౌళి తాజాగా జపాన్ టూర్‌లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ‘త్రిపుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో ఆయన తన ఫేవరెట్ రాబోయే తెలుగు సినిమాల గురించి ఆసక్తికరంగా స్పందించారు.రాజమౌళి చెప్పినట్లుగా, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతోన్న స్పిరిట్, అలాగే రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న పెద్ది సినిమాల కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని తెలిపారు.

 

మహేష్ బాబు రాజమౌళి సినిమా టీమ్ అంత హాట్ హాట్ గా ఉందా..?

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. రాజమౌళి సినిమాలంటేనే భారీ అంచనాలు, అద్భుత కథాంశం, వౌవ్ ఫ్యాక్టర్… వాటికితోడు మహేష్ బాబు స్టార్డం కలిస్తే, ఈ ప్రాజెక్ట్ చుట్టూ క్రేజ్ మరింత పెరిగిపోతోంది.

ఇకపోతే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని, మహేష్ బాబు ఇటలీకి, రాజమౌళి జపాన్‌కు వెళ్లారు. అయినప్పటికీ సినిమా టీమ్ షూటింగ్ తర్వాతి షెడ్యూల్‌కి సంబంధించి ప్లానింగ్‌లో బిజీగా ఉంది.అయితే ఫ్యాన్స్ మాత్రం “స్టోరీ ఏంటి?”, “ఫస్ట్ లుక్ ఎప్పుడివ్వబోతున్నారు?” అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బజ్‌ని మేకర్స్ క్యాష్ చేసుకోవాలంటే ఏదైనా అఫిషియల్ అప్డేట్ ఇవ్వాలి. లేదంటే కాస్త బజ్ తగ్గే ప్రమాదం ఉంది.

TAGS