అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప : ది రూల్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ నిన్న మొన్నటి వరకు శరవేగంగా సాగింది కానీ, రీసెంట్ గా కాస్త బ్రేక్ దొరికింది. ఆగష్టు 15 వ తారీఖున సినిమాని ఎలా అయినా విడుదల చెయ్యాలని మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుకుమార్ టేకింగ్ కోసం ఎంత సమయం తీసుకుంటాడో మన అందరికీ తెలిసిన విషయమే.
పుష్ప సినిమాకి అయితే విడుదల రోజు కూడా గ్రాఫిక్స్ వర్క్స్ మీద పని చేస్తూ ఉండేవాడు. ఓవర్సీస్ కి వెళ్లిన ప్రింట్స్ మొత్తం చాలా వరకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానివే. ఆడియన్స్ ఆ ఔట్పుట్ ని చూసి ఏందీ ఈ సగంసగం పనులు అప్పట్లో సుకుమార్ ని ఒక రేంజ్ లో తిట్టారు. ఇప్పుడు పుష్ప ది రూల్ విషయం లో కూడా అదే జరగబోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇన్ని రోజులు షూటింగ్ శరవేగంగా చేస్తున్నట్టు మన అందరికీ అనిపించింది. కానీ ఇప్పటి వరకు కేవలం 30 శాతం సినిమా షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యిందట. కేవలం హీరోయిన్ రష్మిక కి సంబంధించిన కాల్ షీట్స్ దాదాపుగా 50 రోజుల వరకు అవసరం ఉందట.
కేవలం రష్మిక కి సంబంధించిన షూటింగ్ ఇన్ని రోజులు ఉంటే, ఇక మిగిలిన ఆర్టిస్టులకు సంబంధించిన షూటింగ్ ఎంత బ్యాలన్స్ ఉండి ఉంటుందో అని అభిమానులు అనుకుంటున్నారు. పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ సినిమా ఆగష్టు 15 కాదు, డిసెంబర్ లో కూడా విడుదలయ్యే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మూవీ టీం రెస్పాన్స్ ఇవ్వాల్సిందే . ఈ సినిమా ఆగష్టు 15 న విడుదల కాకపోతే ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.