NTR : చంద్రబాబుతో సయోధ్యకు ఎన్టీఆర్ మంతనాలు చేస్తున్నారా..?

NTR

NTR and Babu

NTR : నందమూరి, నారా కుటుంబాలతో కలవాలని ఎన్టీఆర్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ కారణంగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వేడుకలకు నందమూరి, నారా ఫ్యామిలీ పిలుస్తుంది. పైగా నారా వారి ఇంటి నుంచే ఎన్టీఆర్ వియ్యం అందుకున్నారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ బాబాయ్ కి, టీడీపీ తరుఫున ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం చేయలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడిప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాల కృష్ణ కుటుంబాలతో సయోధ్య కుదర్చడానికి ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

స్పష్టమైన వివరాలు లేనప్పటికీ.. అతను కుటుంబంతో తిరిగి కలవడానికి ప్రయత్నిస్తున్నాడని. నారా రోహిత్ నిశ్చితార్థానికి ఆహ్వానం కూడా వస్తుందని భావించారని సమాచారం. అయితే ఆయనకు ఆహ్వానం అందలేదని, అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారనేది వాస్తవం.

ఇప్పుడు కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్టీఆర్ కొంత మంది వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేుస్తున్నాడని నందమూరి, నారా కుటుంబాలతో మమేకమయ్యేలా ఫ్యామిలీ ఈవెంట్లకు సైతం ఆహ్వానం అందుతుందని భావిస్తున్నారట. ఒక అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి ప్యాచ్ అఫ్ ప్రక్రియను ప్రారంభించాలని కొందరు ఎన్టీఆర్ కు సూచిస్తున్నారని ఇన్ సైడర్ ఒకరు పేర్కొన్నారు. ఈ సమాచారం ఖచ్చితత్వం అస్పష్టంగా ఉంది. కానీ కొన్ని వర్గాలు ఇదే చెబుతున్నాయి. ఇన్నేళ్లయినా నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ ను కలవనివ్వకపోవడం ఆ కుటుంబానికి పెద్ద లోటని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

TAGS