JAISW News Telugu

Niharika Life : నిహారిక లైఫ్ ఇలా అవ్వడానికి నాగబాబే కారణమా.. ఆ సూపర్ హిట్ సినిమాను వదిలేయడంతో.. 

Niharika Life

Niharika Life, Nagababu

Nagababu Reason for Niharika Life : మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ మెగా డాటర్ గా ప్రతీ ఒక్కరికి సుపరిచితమే.. ఇక పర్సనల్ లైఫ్ లో ఈ భామకు చేదు అనుభవమే మిగిలింది.. మెగా కుటుంబం మొత్తం ఏరి కోరి మరీ సంబంధం తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసారు.

2020లో నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది.. అప్పట్లో వీరి పెళ్లి చూసి మెగా ఫ్యాన్స్ అంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు.. అయితే ఈ జంట మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు.. ఇక ఇప్పుడు మళ్ళీ నిహారిక కెరీర్ పైన ఫోకస్ పెట్టింది.

ఇదిలా ఉండగా ఈ భామ గతంలో చేసిన తప్పు ఇప్పుడు బయట పడింది.. అప్పట్లో ఈమె సినిమాలు చేస్తున్న సమయంలో బిగ్ ఆఫర్ రాగా ఈ భామ రిజక్ట్ చేసిందట.. ఆ సినిమా చేసి ఉంటే ఈమె కెరీర్ మరోలా ఉండేది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నిహారిక వదిలేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..

నిహారిక వదిలేసినా ఆ సినిమా ఏంటంటే 100% లవ్.. నాగ చైతన్య, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ సినిమాను గీత ఆర్ట్స్ వారు నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..

2011లో రిలీజ్ అయినా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.. నాగ చైతన్య కెరీర్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతోనే తమన్నా కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది.. అయితే తమన్నా స్థానంలో నిహారిక ఉండాలట.. తండ్రి నాగబాబు ఒప్పుకోక పోవడంతో ఈమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. నిహారిక కూడా అయిష్టంగానే ఈ సినిమాకు నో చెప్పిందట..

Exit mobile version