Lok Sabha Results 2024 : మూడోసారి మోదీ రాబోతున్నాడా? ఏం జరుగబోతోంది..

Lok Sabha Results 2024

Lok Sabha Results 2024

Lok Sabha Results 2024 : దేశమే కాదు ప్రపంచ దేశాలు భారత్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠను కనబరుస్తున్నాయి. మోదీని నిలువరించేందుకు ఇండియా కూటమి చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుంది..ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే ఉత్కంఠకు నేడే తెరదించబోతోంది ఎన్నికల సంఘం.  నేటి ఉదయం 8 గంటల నుంచి దేశంలోని 543 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఏకకాలంలో ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ పూర్తవుతున్న కొద్ది ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ సహ పలు ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి పేరిట జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించకుంటే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది. ఇప్పటికే ఆ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తోంది. కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఇక మూడో సారి కూడా బీజేపీ వస్తే..ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తప్పక ప్రయత్నాలు చేస్తారు కమలనాథులు . అలాగే ఆప్, తృణమూల్ ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పవు.

పలు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికలు వాటి భవిష్యత్ ను తేల్చేవే. అందుకే మోదీని గద్దె దించడానికి ఆ పార్టీలు చేయని ప్రయత్నం లేదు. మరి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారు..మూడోసారి మోదీకి అధికార పగ్గాలు అప్పజెప్తారా..ఇండియా కూటమిని కనకరిస్తారా అనేది నేటి సాయంత్రం వరకు తేలిపోనుంది. ఈ ఎన్నికల ఫలితాలతో ఎంతో మంది నేతల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే అందరూ డు ఆర్ డై అన్నట్టుగా పోరాడారు. అయితే మొన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వేలు ఎన్డీఏకే జై కొట్టిన విషయం తెలిసిందే. సర్వేలన్నీ నేటితో తారుమారు అవుతాయని సోనియా గాంధీ నిన్న వ్యాఖ్యానించారు. అయితే కమలనాథులు మాత్రం ఏన్డీఏ కూటమి 350 సీట్లకు పైగా సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. నేడు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగా..ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగడం గమనార్హం. ఎవరి వైపు మొగ్గు ఉంటుందో మధ్యాహ్నం వరకు ఓ క్లారిటీ రానుంది.

TAGS