Manchu Manoj : మంచు మనోజ్ అన్నది మంచు విష్ణునేనా? ఆ గొడవేంటి?

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj : మంచు మనోజ్ గురించి తెలియని వారు లేరు.. ఈయన ఎక్కువ సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కెరీర్ స్టార్ట్ అయ్యి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఈయనకు హిట్స్ అంతగా పడింది లేదు.. ఇకటి అరా హిట్స్ అందుకున్న స్టార్ హీరో అవ్వలేక పోయాడు.

ఇదిలా ఉండగా మంచి మనోజ్ తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన ”సోదరా” సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసారు. సంపూర్ణేష్ బాబు నాకు సోదరుడితో సమానం అంటూ మంచు మనోజ్ తెలిపారు. సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించారు..

ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతుండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా మంచు మనోజ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మరి ఈ వేదికపై మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈయన మాట్లాడుతూ.. ”సంపూ ఎంత మంచి వాడో ఆయన నవ్వు చూస్తేనే అర్ధం అవుతుంది.. ఇక ఈ సినిమాను బ్రదర్స్ ఎమోషన్స్ మీద తీయడం సంతోషంగా ఉంది.. సోదరుల అనుబంధం ప్రత్యేకం.. అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.. అప్పుడే వారి బంధం బాగుంటుంది” అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.. ఈ వ్యాఖ్యలు తన సోదరుడు విష్ణు మీదనే చేశాడా అని అంత తెగ చర్చించు కుంటున్నారు.

TAGS