Mahesh Babu Remuneration : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం మరి కొద్ది గంటల్లో మన ముందుకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కి టాలీవుడ్ రికార్డ్స్ షేక్ అయ్యాయి. హైదరాబాద్ మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా ఏకంగా #RRR మరియు ‘సలార్’ చిత్రాల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
ఒక మామూలు కమర్షియల్ సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్ గ్రాస్ వసూళ్లు కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాత్రమే సాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకి కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండే 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం మహేష్ బాబు ఒక్కో సినిమాకి 75 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన ఈ సినిమాకి కేవలం 40 నుండి 45 కోట్ల రూపాయిలు మాత్రమే తీసుకున్నాడట. ఇంత తక్కువ రెమ్యూనరేషన్ టాలీవుడ్ ఈమధ్య కాలం లో ఏ హీరో కూడా తీసుకోలేదని టాక్. ఎందుకు మహేష్ అంత తక్కువ తీసుకున్నాడో తెలీదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలుసుకొని షాక్ లో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన దుబాయ్ ప్రీమియర్ షో టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. మహేష్ నుండి ఇంత బిందాస్ మాస్ సినిమా చూసి చాలా కాలం అయ్యిందని, ఈ రేంజ్ లో తమ అభిమాన హీరోని చూపించినందుకు ధన్యవాదాలు అంటూ దుబాయ్ మహేష్ ఫ్యాన్స్ అంటున్నారట.
మరి ఇదే రేంజ్ టాక్ రేపు రెగ్యులర్ షోస్ కి కూడా వస్తుందో లేదో చూడాలి. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షో ని మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్షం లో కూర్చొని చూస్తాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో చుట్టేసింది.