JAISW News Telugu

KCR : బీఆర్ఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కేసీఆర్ కలలు కంటున్నాడా?

KCR

KCR

KCR : పార్లమెంట్ ఎన్నికల వేల తెలంగాణలో రెండు సమాంతర రాజకీయ వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయిస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతుండగా.. బీఆర్ఎస్ మునిగిపోతున్న ఓడ అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదని రెండు జాతీయ పార్టీలు చెప్తున్నాయి.

ఈ రాజకీయ చర్చ మధ్య బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తీసుకురావాలని, వారిలో కొత్త జోష్ నింపాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు.

తన వైపు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక కాంగ్రెస్ అగ్రనేత తనను సంప్రదించారని టీవీ లైవ్ లో కేసీఆర్ చెప్పారు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ వైపునకు వెళ్లేందుకు ఇంట్రస్ట్ గా లేరని బీఆర్ఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని కేసీఆర్ చెప్పారు.

ఒకవైపు బీఆర్ఎస్ మునిగిపోతున్న ఓడ అని కేసీఆర్ తప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో పూర్తి బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా లాగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని ఆయన అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఉద్వేగభరితమైన వాదన మధ్య, రాబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల విజయంపై రోజు రోజుకు లెక్కలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు అది కూడా అత్తెసరు మెజారిటీతోనే అంటూ వాదనలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Exit mobile version