KCR : కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ పగటి కలలు కంటున్నారా..?
KCR : కేసీఆర్ తీరు ‘చింత చచ్చినా పులుపు చావదన్న’ చందంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నా.. రాష్ట్రంలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదాలు ముంచుకస్తున్నా.. ఇంకా మేకపోతు గాంభీరాలు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆయన ఒక సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇది ఊహించేందుకు కరెక్ట్ కాదని అంటున్నారు.
ప్రభుత్వ పక్షాన్ని వీడి ప్రతిపక్షంలోకి వెళ్లాలని ఎవరైనా అనుకుంటారా అన్న సందేహాలు వినిపిస్తు్నాయి. పాలక పక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీని దేశ పార్టీగా మార్చిన దేశంలో చక్రం తిప్పాలని అనుకుంటున్న కేసీఆర్ లాంటి నాయకుడు మాట్లాడితే క్యాడర్ కూడా ఆలోచనలో పడింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కొనసాగుతున్నాడు. దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్ లో ఉన్నారని ఆయన చేసిన ప్రకటన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ పగటి కలలు కంటున్నారా అని వారు అనుమానం వ్యక్తం చేశారు.
పదునైన మాటలకు, ప్రత్యర్థులపై ఘాటు విమర్శలకు పెట్టింది పేరుగా నిలిచిన కేసీఆర్ పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకే రోజు రోజుకు కింది కిందికి పడిపోతున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు పెరగకుండా ఉండేందుకు.. పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేసీఆర్ తన తాజా సమావేశంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.
వాస్తవానికి అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్న తమ పార్టీలోకి ఎవరైనా అధికార కాంగ్రెస్ ను వీడి ఎందుకు చేరుతారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుందని కూడా సర్వేలు అంచనా వేశాయి.