Jagan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ తిరుగులేని శక్తిగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు పార్టీకి చేటు తెచ్చేలా ఉంటున్నాయి. తెలంగాణ రాజకీయ ఫలితాలు జగన్ లో భయాన్ని కలిగించాయి. పదేళ్లు తిరుగులేని సీఎంగా చక్రం తిప్పిన కేసీఆర్ ను ఒక్క ఓటుతో అధికారానికి దూరం చేసిన పరిణామం జగన్ లో మార్పు వచ్చేలా చేసింది. దీంతో పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడటంతో అసమ్మతి మరింత పెరుగుతోంది.
తాజా మార్పులు జగన్ కు ప్రతికూలంగా మారుతున్నాయి. 2024లో అధికారమే లక్ష్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆగ్రహజ్వాలలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నట్లు పార్టీలో ప్రస్తుతం ఆరని మంటలు రగులుతున్నాయి. జగన్ పై ఆగ్రహంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మీ వల్లే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందనే వాదనలు జగన్ తీసుకొస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పిన జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సగం సీట్లు సొంతం చేసుకోవడమే కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన వరుస సమావేశాలతో దూసుకుపోతున్నాయి. జగన్ ను గద్దెదించడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు జగన్ లో వచ్చిన మార్పులకు అందరు బెదిరిపోతున్నారు. తమ సీటు ఎక్కడ పోతుందనే భయంతోనే మంత్రులు ఉన్నారు. ఈనేపథ్యంలో జగన్ ఆలోచనలు వారిని పార్టీ వీడేలా చేస్తున్నాయి. పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీనేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు వారికి పనిలేకుండా చేసి ఇప్పుడు మీవల్లే పార్టీ నాశనం అవుతుందనే ఉద్దేశంతో వారిని బలిపశువులుగా చేయడంతో పార్టీని నష్టం వాటిల్లుతోంది. ఓ పక్క ఉద్యోగులు, మరోపక్క అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీని పుట్టి ముంచుతున్నాయనే వాదనలు అందరిలో వస్తున్నాయి.