- వాస్తవాలు గ్రహించలేదా?
Astrologer Venu Swamy : ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేణు స్వామి సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కొందరి విషయాల్లో ఆయన చెప్పిందే నిజమైనా మరి కొందరి విషయాల్లో కొంత అంచనాలు తప్పాయి. ప్రభాస్ జ్యోతిష్యంలో జరగబోయేది ఇదేనంటూ షాకిచ్చాడు. ప్రభాస్ గురించి ఆయన చెప్పింది నిజమేనని ఓ సందర్భంలో అనిపించినా తర్వాత మాత్రం ఆయన చెప్పినదానికి రివర్స్ గా జరగడంతో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యాడు. కానీ వేణు స్వామి మాత్రం తన బెట్టు వీడడం లేదు. ముందు ముందు తాను చెప్పిందే జరుగుతుందంటూ ఘంటాపథంగా చెబుతున్నాడు.
సినీ ప్రముఖుల జాతకాలతో పాపులారిటీ..
సినీ ప్రముఖుల జీవితాలు, భవిష్యత్ ఎలా ఉంటాయనే విషయాలు చెబుతూ పాపులారిటీ పెంచుకున్నారు వేణుస్వామి. ప్రధానంగా సినీ నటీటుల వైవాహిక సమస్యలు, విడాకుల గురించే ఆయన ఎక్కువగా చెబుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పెళ్లి పెటాకులవుతుందని ఆమెకు తాను ముందే చెప్పానంటూ మరోసారి బాంబు పేల్చాడు. కానీ అప్పుడామె తనను తిట్టి వెళ్లిపోయిందని, ఇప్పుడు నిజమయ్యే సరికి బాధపడుతుందని పేర్కొంటున్నాడు.
పాపులారీటీ కోసం కాదు..
తాను పాపులారిటీ కోసం ఏది పడితే అది చెప్పనని పలు ఇంటర్య్యూ్ల్లో స్పష్టం చేశారు. కీడెంచి మేలు కోరాలనే సిద్ధాంతం తనదంటున్నారు . తాను చెప్పేది జోస్యం కాదు.. జాతకమని, తన ప్రతిభ గురించి చెబుతున్నారు .జాతకం, గ్రహ స్థితి బట్టే తాను మాట్లాడుతనని స్పష్టం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్లు సమంత, నాగచైతన్య వైవాహిక జీవితం సక్సెస్ అవ్వదని, వారు విడిపోతారని చెప్పారు. కానీ వారిద్దరి అభిమానులు మాత్రం వేణు స్వామిని ఆ సమయంలో ట్రోల్ చేసి ఆడుకున్నారు. కానీ చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. కానీ రాజకీయాల గురించి ఆయన చెప్పిన విషయాలు మాత్రం బెడిసికొట్టాయి.
కలర్స్ స్వాతి విషయంలో..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కలర్ స్వాతి తన వద్దకు వచ్చిందని చెప్పారు. ఆమె జాతకం చూసి కొన్ని విషయాలు అప్పుడే చెప్పానని, కానీ ఆమె తాను చెప్పిన విషయాలు గ్రహించకుండా మండిపడ్డారని, దారుణంగా తిట్టిందని వేణు స్వామి చెప్పారు. ఆమె వైవాహితన జీవితం నిలబడదని, భర్తతో విడాకులు తీసుకొనే పరిస్థితి ఉందని అప్పుడే చెప్పానని వెల్లడించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తనను తిట్టి వెళ్లిపోయిందన్నారు. అయితే ఆమె విషయంలో తాను చెప్పిందే నిజమైందన్నారు. తాను ఉద్దేశ పూర్వకంగా చెప్పింది కాదని, ఆమె జాతకం అలాంటిదని స్పష్టం చేశారు.