Aiswarya Rai:మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అత్త జయాబచ్చన్.. అభిషేక్ సోదరి శ్వేతానందా బచ్చన్ తో ఐశ్వర్యారాయ్ కి పొసగడం లేదని విభేధాలున్నాయని చాలా కాలంగా ప్రచారం ఉంది. బచ్చన్ కుటుంబంలో చాలా కాలంగా కలతలు ఉన్నాయన్న ప్రచారం హిందీ మీడియాలో ఉంది. ముఖ్యంగా శ్వేతాబచ్చన్ తో ఐష్‌కి అస్సలు పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంటూ తీవ్రమైన ప్రచారం ఇటీవల సాగింది. ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడరు అని కూడా మీడియాలో కథనాలొచ్చాయి.
మరోవైపు అభిషేక్ బచ్చన్ కి దూరంగా తన పుట్టింట్లో ఉంటోందని కూడా ఐష్ పై ఇటీవల పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఒక వేళ ఇంట్లో ఉన్నా కానీ, తనకంటూ ఒక సపరేట్ స్పేస్ ని ఎంపిక చేసుకుని ఐశ్వర్యారాయ్ సపరేట్ గానే ఉంటున్నారని కూడా తాజాగా ప్రముఖ హిందీ మీడియాలు కథనాలు వేయడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని గందరగోళం నెలకొంది. బాలీవుడ్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తల్లో ఆ ఇద్దరూ విడిపోయారంటూ ధృవీకరించేయడం ఆందోళన కలిగించింది.
అయితే ఈ పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షిక ఉత్సవాల్లో అభిషేక్- ఐశ్వర్యారాయ్ జంటగా కలిసి కనిపించారు. అంతేకాదు.. అభిషేక్- ఆరాధ్యతో పాటు అమితాబ్, అగస్త్య నందా తదితరులతో ఐష్ కనిపించింది. దీంతో అభిషేక్ – ఐష్ జంట విడిపోలేదని పూర్తి క్లారిటీ వచ్చింది. ఆ ఇద్దరూ కలిసే ఉన్నారు. కానీ మీడియాలో దారుణమైన తప్పుడు ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాల్లో ఏది నిజం? ఏది అబద్ధం ? అని తెలిసే లోపే వార్త వేగంగా వైరల్ అయిపోతోంది. దీనిని అమాయకులు నమ్మేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇప్పుడు అభిషేక్ – ఐశ్వర్యారాయ్ విడిపోయారన్న ప్రచారం సాగుతున్నా.. అలాంటిదేమీ లేదని ఐశ్వర్యారాయ్ ప్రూవ్ చేసారు.