BRS : బీఆర్ఎస్ ను ఓడించింది వారి అహంకార ధోరణేనా?

arrogance that defeated BRS

arrogance that defeated BRS

BRS : రాజకీయాలు అంటే పరిణతి ఉండాలి. ఆలోచన, ఆచరణ సరైన విధంగా ఉండకపోతే కష్టాలు తప్పవు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నేతల మాటల్లో పొంతన ఉండటం లేదు. ఓటమిని ఓ గుణపాఠంగా చూడటం లేదు. వాపును చూసుకుని బలుపుగా అనుకుంటున్నారు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకోవాలి కానీ వాటిని వారి తప్పిదాలుగా అనుకోవడం లేదు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కూల్చడం మాటలు కాదు. ఇప్పుడుకొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పడం ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనంగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేటీఆర్ చెప్పడం ఆయన తెలివి తక్కువతనానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఏదో నలుగురు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొడతామని అనుకుంటే పొరపాటే. దానికి చాలా తతంగం ఉంటుంది.

ఎన్నికల్లో తాము ఓడిపోలేదు ఎమ్మెల్యేలే ఓడిపోయారని కేటీఆర్ చెప్పడం గమనార్హం. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరిని ఓడించిన బీజేపీ అభ్యర్థిదే గ్రేట్. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన ఘనత అతడి సొంతం. మరి దీనికి కేటీఆర్ ఏంచెబుతారు? కేసీఆర్ కు ఇంకా ప్రజాబలం తగ్గలేదనే కేటీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారని అంటున్నారు.

కేటీఆర్ అహంకారపూరిత ధోరణితోనే ఓటమి పాలయ్యారని పలువురు పేర్కొంటున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓటమి పాలైన బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం కలగడం లేదు. తమ ఓటమికి ఇతర కారణాలు చూపుతున్నారు. కానీ వారి అహంకార ధోరణి మార్చుకోవడం లేదు. దీంతో వారు కూర్చున్న కొమ్మను వారే నరుక్కుంటున్నారనే వాదనలు వస్తున్నాయి.

TAGS