Natural Star Nani : నేటి తరం హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేసి, ఆ తర్వాత అదృష్టం కొద్దీ మొదటి సినిమా లోనే హీరోగా చేసే ఛాన్స్ కొట్టేసాడు.
అలా ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరో గా కెరీర్ ని మొదలు పెట్టిన నాని, ఆ తర్వాత విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ,హిట్టు మీద హిట్టు కొడుతూ ఇండస్ట్రీ లోకి దూసుకొని వచేసాడు. ఎంతో మంది యంగ్ హీరోలు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ కూడా నాని సాధించిన బ్రాండ్ ఇమేజిని సంపాదించలేకపోయారంటే నాని టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ‘దసరా’ సినిమాతో వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరాడు నాని.
ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూ వచ్చిన యంగ్ హీరోలు ఇప్పటికీ అందుకొని వంద కోట్ల రూపాయిల క్లబ్ ని నాని అతి తేలికగా అందుకున్నాడు. అదే ఏడాది లో విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి దగ్గరగా వచ్చింది. ఈ స్థాయికి చేరుకోడానికి నాని కి అదృష్టం ఒక్కటే కాదు, ఆయన కష్టం కూడా కలిసి వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో నాని ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ క్రింద పని చేసాడు. ఎన్నో అవమానాలను కూడా ఎదురుకున్నాడు. కేవలం సినిమాలకు మాత్రమే కాదు, సీరియల్స్ కి కూడా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఆ సీరియల్ మరేదో కాదు, అమృతం. అమృతం అనే కామెడీ సీరియల్ మన బాల్యం లో ఒక భాగం.
చిన్న తనం లో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం ఈ సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ ని జీ 5 యాప్ లో చూస్తూనే ఉంటాం. ఈ సీరియల్ కి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడట. కొన్ని ఎపిసోడ్స్ కి దర్శకుడు అందుబాటులో లేకపోతే నాని నే దర్శకత్వం వహించాడట, వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కూడా. కానీ నాని పేరుని మాత్రం ఆ ఎపిసోడ్స్ కి వెయ్యలేదట, ఈ విషయం పై అప్పట్లో నాని చాలా హర్ట్ అయ్యినట్టు టాక్ వినిపించింది.