Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పెట్టుబడులు రావడం ఇంత కష్టమా..?

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh : రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే ఆ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి.. దానికి ఆర్థిక, పారిశ్రామిక విధానాలు ఉండాలి. వాటికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తోడవుతాయి. దీని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను పరిశీలిస్తే, పారిశ్రామికవేత్తలు ఆశించే లక్షణాలన్నీ కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టే లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, టీ కంపెనీలు తరలివచ్చాయి.

హైదరాబాద్‌లో టీ రంగానికి బాబు బలమైన పునాదులువేస్తే ఆయనను ధ్వేషించినా సరే కేసీఆర్‌ ఐటీ రంగాన్ని వద్దనుకోకుండా మరింత ముందుకు సాగడం వల్లే తెలంగాణకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు ప్రవాహంలా వచ్చి వచ్చాయి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవిస్తేనే ఆ రాష్ట్రానికి విశ్వసనీయత ఏర్పడుతుంది. అప్పుడే పెట్టుబడులు వస్తాయని స్పష్టంగా తెలుస్తుంది.

కానీ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిలిపివేయించడమే తన విధానంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించడం వలన ఏపీ పెట్టుబడిదారుల విశ్వసనీయత కోల్పోయింది. జగన్‌ ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడులపై ఆసక్తి చూపకపోగా ఉన్నవాటిని రాష్ట్రం నుంచి తరిమేస్తుండడంతో ఏపీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఎవరూ చేయలేదు.

జగన్‌ అనుసరించిన మూర్ఖపు విధానాల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని బాబు చెప్పారు. ఇప్పుడు పెట్టుబడులు తీసుకురావడం కంటే ముందు వారికి రాష్ట్రంపై నమ్మకం కల్పించడమే పెద్ద సవాల్ గా మారిందని చంద్రబాబు అన్నారు.

తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని తెలిసినప్పటికీ ఐదేళ్లలో జగన్‌ నిర్వాకం వల్ల పెట్టుబడిదారుల్లో ఒక రకమైన అపనమ్మకం, భయం ఉండడం సహజమని, కనుక మీడియా కూడా రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

వేలకోట్లు పెట్టుబడులు పెట్టాక ఐదేళ్ల తర్వాత మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు ఆలోచించకుండా ఉండరు. కనుక జగన్‌ మళ్లీ అధికారంలోకి రాలేడని చంద్రబాబు వారికి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. అప్పుడే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ ఇది పెట్టుబడులను ఆకర్షించడం కంటే చాలా కష్టం.

జగన్‌ కూడా పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో రాజకీయాలకు అతీతంగా మొదటి దఫాలో బాబు మొదలుపెట్టిన పనులను యథాతధంగా కొనసాగించి ఉంటే ఈ సమస్య ఎదురయ్యేదే కాదు కదా..? కానీ జగన్‌ ఐదేళ్లలో చేసిన విధ్వంసమే కాకుండా ఏపీ భవిష్యత్‌ను దెబ్బ తీశారన్న మాట.

ప్రజలు నమ్మకంతో రాష్ట్రాన్ని జగన్‌ చేతిలో పెడితే చివరికి ఇటువంటి సమస్యలను కూడా సృష్టించి చేతులు దులుపుకువెళ్లిపోయారని, అయినా రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు.

TAGS