JAISW News Telugu

Salaar Break Even : ‘సలార్’ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమేనా..? ఇంకా ఎంత వసూళ్లు రావాలంటే!

Salaar Break Even

Salaar Break Even

Salaar Break Even : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏ రేంజ్ ఓపెనింగ్స్ అంటే షారుఖ్ ఖాన్ సినిమా కూడా బెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ అన్నమాట. ఆ స్థాయి ఓపెనింగ్స్ ని దక్కించుకొని మొదటి వారం లోనే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. లక్కీ గా న్యూ ఇయర్ కలిసి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే రెండవ వారం కారం 12 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టి ఉండేది కాదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

ఇప్పటికీ ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ రెండు వారాలకు కలిపి 580 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 325 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయింది. కానీ హిందీ నుండి మాత్రం రోజుకి రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇప్పటి వరకు ఒక్క ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటలేదు. నైజాం లో దాటింది అని అన్నారు కానీ, రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ కి మరో ఆరు కోట్ల రూపాయిల షేర్ రావాలి అన్నాడు.

సీడెడ్, ఉత్తరాంధ్ర, కృష్ణ, ఓవర్సీస్, కర్ణాటక ఇలా అన్నీ ప్రాంతాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత వసూళ్లను రాబట్టాలన్నా జనవరి 12 లోపే రాబట్టాలి, ఆ తర్వాత సంక్రాంతి కొత్త సినిమాలు వచ్చేస్తాయి. హిందీ లో ఇంకా రన్ ఉంది కాబట్టి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని దాటొచ్చు కానీ, ప్రాంతాల వారీగా మాత్రం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రతీ సినిమా రాజమౌళి సినిమాలాగే ఆడదు. కాబట్టి లిమిటెడ్ గా బిజినెస్ చేసుకోవడం మంచిది, సలార్ చిత్రానికి మరీ ఓవర్ గా బిజినెస్ చెయ్యడం వల్లే, ఆ సినిమా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Exit mobile version